Jogaiah wants crucial place in Chiru party?
January 31st, 2008
కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తున్న ధోరణి వల్లే చిరంజీవి సొంత పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో వున్నారంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయడం ద్వారా మరోసారి వార్తల్లో కెక్కిన కాంగ్రెస్ నాయకుడు, పార్లమెంటు సభ్యులు చేగొండి హరిరామజోగయ్య తీరును కాంగ్రెస్ వారే గాక, చిరంజీవి వర్గం కూడా నిశితంగా గమనిస్తోంది. కొంతకాలంగా ఆయన వ్యవహార సరళి చిరంజీవికి అనుకూలంగా వున్నదని చాలామంది భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ నాయకుల తీరుని ఎండగట్టిన ఆయన చిరంజీవి పార్టీ పెడితే ఆయనకు మద్దతునిస్తాననీ, ఆయన పార్టీలో చేరతాననీ బహిరంగంగా వ్యాఖ్యానించారు. అలాగే రాజశేఖర్‌పై జరిగిన దాడి ఉదంతంలో చిరంజీవిపై బురద చల్లడానికే వ్యాఖ్యలు చేశారంటూ రాజశేఖర్‌నే ఆయన విమర్శించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకుల ధోరణిని విమర్శిస్తూ, చిరంజీవికి మద్దతుగా ఆయన సోనియాకు లేఖ రాశారు. దీన్ని మీడియాకు అందేట్లు చేశారు. ఇదంతా చూస్తుంటే ఆయన చిరంజీవి పార్టీలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే జోగయ్య ఆశిస్తున్నది కేవలం ఆ పార్టీలో స్థానం కాదు. కీలక పాత్ర. చిరంజీవి దృష్టిని ఆకట్టుకుని ఆయన పెట్టే పార్టీలో తనకంటూ ఒక ప్రధాన పదవిని చేజిక్కించుకోవాలనీ, చక్రం తిప్పాలనీ ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన తన పార్టీ వారిపై విమర్శలు గుప్పిస్తూ, చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల ప్రవర్తన వల్లే చిరంజీవి పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నారనీ, ఆయన పార్టీ పెడితే కాంగ్రెస్‌కి పెద్ద దెబ్బ అవుతుందనీ కొత్త వాదం కూడా ఒకటి ఆయన తెరమీదకు తెచ్చారు.
జోగయ్య తీరు కాంగ్రెస్ నాయకుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించడం సహజమే. అయితే చిరంజీవి వర్గం కూడా జోగయ్య తీరుపట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోంది. ఆయన తరచూ చేస్తున్న వ్యాఖ్యల్ని నిశితంగా గమనిస్తోంది. కాంగ్రెస్‌లో వుంటూ ఆ పార్టీ నాయకులపైనే విమర్శలు చేస్తూ, రచ్చకెక్కుతున్న వ్యక్తి రేపు తమ పార్టీలోకి వస్తే అదే తీరుని కొనసాగించడనే గ్యారంటీ ఏమిటనే అంశాన్ని కొందరు సన్నిహితులు ఇప్పటికే చిరంజీవి దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. హరిరామజోగయ్య గాలివాటుకు తగ్గట్లు ప్రవర్తించే వ్యక్తనీ, తరచూ పార్టీలు మారుస్తుంటాడనీ, అలాంటి వ్యక్తివల్ల లాభం కంటే నష్టం ఎక్కువనీ వారు ఆయనకు చెప్పినట్లు చిరంజీవి సన్నిహిత వర్గాల సమాచారం. రేపు తనకి రుచించని పని ఏదైనా చేస్తే ఇదేవిధంగా అప్పుడూ రచ్చకెక్కే అవకాశం వుంటుందని సన్నిహితులు చెప్పిన మాటల్ని చిరంజీవి ఆలకించినట్లు వారు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో హరిరామజోగయ్య రాజకీయ భవిష్యత్తు ఏ దారిన మళ్లుతుందో వేచి చూడాల్సిందే.
...యజ్ఞమూర్తి

| Give your Rating Here : |
Average Rating: 3.83
Votes: 6
|
News | Box Office | Previews | Reviews | Trailers | Galleries | Wallpapers | Events | Videos | Audio Songs
©2006 - 2008 Chitramala.com - Movies, Hollywood, Bollywood, Music, News, Photos, Videos - All rights reserved.