Sheela's career turns with PARUGU?
March 31st, 2008
ఒక తమిళమ్మాయి తెలుగు చిత్రసీమలో స్థానం కోసం గట్టిగా కృషి చేస్తోంది. ఇప్పటికే రెండు ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థలు తీసిన సినిమాల్లో నటించి ఇప్పుడు మరింత క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె పేరు షీలా. తెల్లగా, ముద్దు ముద్దుగా వుండే ఆమె 2006లో 'సీతాకోకచిలుక' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది. నవదీప్ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ కావడంతో వెంటనే ఆమెకి అవకాశాలు రాలేదు. కానీ పల్లెటూరి చిన్నదానిగా ఆమె అందం, అభినయం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అదే ఆమెకి మోహన్‌బాబు నిర్మాణ సంస్థలో హీరోయిన్ అవకాశాన్ని తీసుకొచ్చింది. ఆయన చిన్న కుమారుడు మనోజ్‌కుమార్ హీరోగా రూపొందిన 'రాజుభాయ్'లో కథలో ఎంతో ప్రాధాన్యమున్న హీరోయిన్ పాత్రను చేసింది. అది నిర్మాణంలో వుండగానే పూరీ జగన్నాథ్‌కు చెందిన వైష్ణో అకాడమీలో నటించే అవకాశం పొందింది షీలా. జగన్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా నటించిన ఆ సినిమా 'హలో ప్రేమిస్తారా'.
ఆ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫెయిలైనా ఆమె నటన దర్శకులు బొమ్మరిల్లు భాస్కర్‌ని బాగా మెప్పించింది. అందుకే అల్లు అర్జున్‌తో తను తీస్తున్న 'పరుగు' చిత్రంలో హీరోయిన్ పాత్రకు ఆమెను ఎంచుకున్నాడు. అందంతో పాటు సంప్రదాయబద్ధమైన తెలుగింటి అమ్మాయి రూపం కలిగిన అమ్మాయి కోసం అతను చేసిన అన్వేషణ షీలా వద్ద ముగిసింది. కథానుసారం హీరో అర్జున్ ఆమెను 'లేపుకుపోతాడు'. ఆమె కుటుంబం వారి కోసం వేట మొదలుపెడుతుంది. వారికి హీరో హీరోయిన్లు దొరుకుతారా? అసలెందుకు హీరోయిన్‌ను హీరో తీసుకుపోయాడు?.. అనేవి ఆసక్తికరమైన ప్రశ్నలు. 'బొమ్మరిల్లు'లో జెనీలియా మాదిరిగా ఈ సినిమాలో షీలా అభినయం అందరి ప్రశంసలూ పొందుతుందని భాస్కర్ చెబుతున్నాడు. వరుస విజయాల నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న 'పరుగు' ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రేక్షకామోదాన్ని పొందితే షీలాకు తెలుగులో మంచి భవిష్యత్తు వుంటుందనేది నిజం.
..యజ్ఞమూర్తి

| Give your Rating Here : |
Average Rating: 3.90
Votes: 5
|
News | Box Office | Previews | Reviews | Trailers | Galleries | Wallpapers | Events | Videos | Audio Songs
©2006 - 2008 Chitramala.com. All rights reserved.