
AVM's Telugu film with Varun Sandesh
|
దక్షిణాదిన పేరుపొందిన చిత్ర నిర్మాణ సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్ చాలా కాలం తర్వాత తెలుగులో ఒక సినిమాను నిర్మిస్తోంది. 'హ్యాపీడేస్' ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శుక్రవారం రామానాయుడు స్టూడియోస్‌లో మొదలైంది. మలయాళీ అమ్మాయి విమలా రామన్ కథానాయిక. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్ సోదరుడు మార్తాండ్ కె. శంకర్ దర్శకునిగా పరిచయమవుతున్నాడు. శుక్రవారం నాటి పూజా కార్యక్రమంలో డి. రామానాయుడు, రమేష్ ప్రసాద్, డీవీఎస్ రాజు, సురేష్‌బాబు, గోపీచంద్, దిల్ రాజు, బోయపాటి శ్రీను, మెహర్ రమేష్ తదితరులు హాజరయ్యారు. నిర్మాతల్లో ఒకరైన ఎం. శరవణన్ మాట్లాడుతూ "ఇది మా సంస్థకు 172వ సినిమా. మాకు తెలుగు పరిశ్రమ కొత్త కాదు. 'జెమిని' తర్వాత తెలుగులో కొంత విరామం వచ్చింది. ఇంతవరకు తెలుగులో 33 సినిమాలు నిర్మించాం. ప్రస్తుత సినిమా విషయానికి వస్తే అందరికీ నచ్చే ప్రేమ కథతో ఇది రూపొందుతుంది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం" అని చెప్పారు. "ఏవీఎం సంస్థ స్థాయికీ, విలువలకీ తగినవిధంగా ఈ సినిమా వుంటుంది. ఆ సంస్థ ద్వారా పరిచయమవుతుండటం సంతోషంగా వుంది. సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అహ్లాదకరంగా సాగుతుంది. ఆరు పాటలుంటాయి" అని దర్శకుడు శంకర్ తెలిపాడు. హీరోగా తనకిది మూడో సినిమా అని వరుణ్ తెలపగా, మలయాళంలో 8, తమిళంలో 2 సినిమాలు చేసిన తనకు తెలుగులో ఇదే తొలి చిత్రమని హీరోయిన్ విమల చెప్పింది. బ్రహ్మానందం, గిరిబాబు, అలీ, సుప్రీత్, అనుహాసన్, రమాప్రభ, రాధాకుమారి, మాస్టర్ వెంకటేష్ తదితరులు తారాగణం. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు టి. రాజసింహ మాటలు, భాస్కరభట్ల రవికుమార్ పాటలు రాస్తున్నారు. వేణుగోపాలన్ సినిమాటోగ్రాఫర్. |
News | Box Office | Previews | Reviews | Trailers | Galleries | Wallpapers | Events | Videos | Audio Songs
©2006 - 2008 Chitramala.com - Movies, Hollywood, Bollywood, Music, News, Photos, Videos - All rights reserved.

























