Dasavatharam audio released by Jackie Chan
భవిష్యత్తులో నటుడు కమల్ హాసన్‌తో కలసి సినిమా చేస్తానని హాలీవుడ్ నటుడు జాకీచాన్ తెలిపారు. దాదాపు 50 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆస్కార్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించగా, కమల్ హీరోగా నటిస్తున్న 'దశావతారం' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం రాత్రి చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ తారలతో నెహ్రు ఇండోర్ స్టేడియం కళకళలాడింది. జాకీచాన్, అమితాబ్ బచ్చన్, మమ్ముట్టి, నటీమణులు, రాజ్యసభ సభ్యులు హేమామాలిని, జయప్రద, అందాల తారలు మల్లికా షెరావత్, అసిన్, చిత్ర కధానాయకుడు కమల్ హాసన్, రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరుణానిధి 'దశావతారం' సీడీలను ఆవిష్కరించారు. అనంతరం జాకీచాన్ మాట్లాడుతూ 'దశావతారం' 20 నిమిషాల నిడివిగల ట్రైలర్ చూశానని, నిజంగా అద్భుతంగా ఉందని చెప్పారు. తనను అంతా సూపర్ స్టార్ అంటారు కాని ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదని. నిజానికి అమితాబచ్చన్ నిజమైన సూపర్ స్టార్ అని కొనియాడారు.            
 
Featured Recommended
 
 
Movies Actress Actor Events