Greenville Ugadi Sambaralu!
అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ గ్రీన్‌విల్ (టాగ్) సంస్థ సభ్యుల కల నిజమయ్యింది. తెలుగు నూతన సంవత్సరం 'శ్రీ సర్వధారి నామ సంవత్సరం'ని పురస్కరించుకుని 2008 ఏప్రిల్ 19న 'ఉగాది 2008' కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. వేదిక్ సెంటర్ ఆఫ్ గ్రీన్‌విల్ లోని అహింసా హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకుల సంఖ్యచూసి నిర్వాహకులు ఉద్వేగం చెందారు. ఆ ప్రేక్షకుల సంఖ్య 500 పైమాటే. ఆ కార్యక్రమం ప్రేక్షకుల్లోనూ మంచి ముద్రవేసింది. వారు కూడా కార్యక్రమం సాగిన తీరుకు మహదానందపడ్డారు.


కార్యక్రమ వేదికను రంగులతో కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఆ వేదికను అంత అందంగా డిజైన్ చేసింది ముగ్గురు స్త్రీలు.. పూర్ణిమ చలువది, శ్రీవల్లి కొండపల్లి, వాసవి మంతెన. అక్కడ ప్రదర్శించిన కార్యక్రమాలన్నింటికీ సరిపోయే రీతిలో వారు నేపథ్యాన్ని సృష్టించడం నిజంగా గొప్ప సంగతి. ఆ నేపథ్యంవల్లే ప్రతి కార్యక్రమం నాణ్యతతో కనిపించింది. ఒక ఐటమ్ తర్వాత మరో ఐటమ్ ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురిచేయడంతో కొరియోగ్రాఫర్లు ఆ రోజుని ఎప్పటికీ జ్ఞప్తి వుంచుకుంటారు. ఆ ప్రేక్షకుల్లో తెలుగు మాట్లాడలేని వాళ్లు చాలామందే వున్నారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఆ కార్యక్రమం ఏ సందర్భంలోనూ విసుగు పుట్టించకపోవడం గమనార్హం.

కార్యక్రమ వేదిక వద్దకు అందరూ సాయంత్రం 5 గంటలకల్లా చేరుకున్నారు. మొదట పాత స్నేహితులు ఒకర్నొకరు పలకరించుకున్నారు. కొత్తవాళ్లని పరిచయం చేసుకున్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన దుర్గాప్రసాద్ నల్లమోతు వ్యాఖ్యాతలని పరిచయం చేశారు. రామ్ గరిపల్లి, అనిత బుడిది, రంజీత మోతే ఎంతో సునాయాసంగా వ్యాఖ్యాతల పాత్రల్ని పోషించారు.


శ్రావ్య దర్భా 'వాతాపి గణపతిం భజే' అనే గణేశ స్తోత్రాన్ని పాడటంతో 5.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. ఆ వెంటనే 'టాగ్' ట్రేడ్ మార్క్ కార్యక్రమంగా చెప్పదగ్గ 'ద కిడ్స్ ఫ్యాన్సీ డ్రస్ కాంపిటిషన్'. పిల్లల కాస్ట్యూమ్స్ అందర్నీ అలరించగా, విజేతలని నిర్ణయించడానికి న్యాయ నిర్ణేతలు బాగా కష్టపడ్డారు. విద్య గుడివాడ 'భరత వేదము', సంజన కొండపల్లి 'అదివో అల్లదివో శ్రీహరి వాసము', ప్రవల్లిక నల్లమోతు 'నెమలికి నేర్పిన' నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.


కార్యక్రమ కోఆర్డినేటర్ వేణు సామ ప్రదర్శించిన కామెడీ స్కిట్ 'చదువా మజాకా'కి నవ్వనివాళ్లు లేరు. అది ఆయన తొలి ప్రదర్శన! వ్యాఖ్యాతల్లోని రామ్ గరిపల్లి చేసిన 'రావణ' ఏక పాత్రాభినయం ఆయనలోని నటనా ప్రతిభను పరిచయం చేసింది.


'పాప్ కల్చర్' విభాగంలో ప్రదర్శించిన పలు పాపులర్ సినిమా పాటల, జానపద నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వాటిని అలా కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ల బృందాన్ని అందరూ అభినందించారు. ఆ విభాగం ఘనత అనిత బుడిది, అప్పారావ్ కొండపల్లి, అరుణ్ కుమారప్ప, గీత నల్లమోతు, జయశ్రీ సుంకర, జ్యోతి గరిపల్లి, జ్యోతి గార్గ్, లక్ష్మి కప్పగంతుల, మంజుల బేతి, రంజీత మోతే, శ్రీనివాస్ చెన్నంరాజు, శ్రీవల్లి కొండపల్లి, సుభాషిణి ఆలపాటి, సునీతా రాజ్, వాసవి మంతెనలకు చెందుతుంది. ఇక దాన్ని ప్రేక్షకులు ఆస్వాదించారంటే, అందులో యువ కొరియోగ్రాఫర్లయిన సంయుక్త కప్పగంతుల, సంజనా దినేష్, శ్రావ్య బుడిది, శ్రావ్య దర్భా, వందనా ప్రేమ్‌కుమార్‌ల పాత్ర ఎంతో వుంది.


కార్యక్రమాన్ని ఆసాంతం ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు, ఆ తర్వాత విందును కూడా ఆస్వాదించారు. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడితో పాటు సంప్రదాయ ఆంద్రా వంటకాలు గుత్తి వంకాయ, మామిడికాయ పప్పు, బూరెలు వంటివి ఆ విందులో చోటు చేసుకున్నాయి. 'ఉగాది గలా' ఈ రీతిన విజయవంతం కావడంలో 'టాగ్' కమిటీ సభ్యుల కృషి ఎంతైనా వుంది. ఆ సభ్యులు.. అప్పారావ్ కొండపల్లి, దేవ్ సుంకర, దేవగాంధీ ఉండమట్ల, దుర్గాప్రసాద్ నల్లమోతు, కృష్ణ వల్లభనేని, కృష్ణ వేమూరి, ప్రభాకర్ బుడిది, ప్రసాద్ పచ్చిపులుసు, ప్రశాంత్ మోతే, రాజు వత్సవాయి, రామ్ ఎం. గరిపల్లి, రమేష్ వేనేపల్లి, రంగా పసుమర్తి, శశిధర్ తమ్మన, శేఖర్ కప్పగంతుల, శేఖర్ మన్నే, శ్రీధర్ గంగవల్లి, శ్రీధర్ యార్లగడ్డ, శ్రీనివాస్‌వర్మ చెన్నంరాజు, సూర్య నర్రా, వెంకట్ గుళ్లాపల్లి, వెంకటేష్ పూడిపెద్ది, వెంకటేశ్వర్ పిచ్చల, వేణు సామా. ఆ సాయంత్రం అక్కడ సమావేశమైన వాళ్లందరికీ అది ఒక ప్రత్యేక కార్యక్రమంగా గుర్తుండిపోవడం ఖాయం. ఈ అసోసియేషన్ గురించీ, ఈ కార్యక్రమం గురించీ మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే www.taggsc.org చూడండి.
 
Featured Recommended
 
 
Movies Actress Actor Events