
Meera Jasmin's 'Okati Nalugu' starts rolling
| మీరా జాస్మిన్ కథానాయికగా నటిస్తున్న 'ఒకటి నాలుగు' సినిమా షూటింగ్ మొదలైంది. బుధవారం హైదరబాద్‌లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డి. రామానాయుడు క్లాప్‌నివ్వగా, రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దీనికి 'గమ్యం' దర్శకుడు క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. రాజ్ కంబైన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా కథ ఒక అమ్మాయి, నలుగురు అబ్బాయిల చుట్టూ నడుస్తుందని ప్రభాకర్ తెలిపారు. అమ్మాయిగా మీరా జాస్మిన్ నటిస్తుండగా, నలుగురు అబ్బాయిల పాత్రల్ని కొత్తవాళ్లు చేస్తున్నారు. నరేష్, బ్రహ్మానందం, ధర్మవరపు, శ్రీనివాసరెడ్డి, మేల్కోటే, సన, హేమ తదితరులు తారాగణం. 'పెళ్లైన కొత్తలో' ఫేమ్ అగస్త్య సంగీతం సమకూరుస్తుండగా, ఎ. రాజా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. |
News | Box Office | Previews | Reviews | Trailers | Galleries | Wallpapers | Events | Videos | Audio Songs
©2006 - 2008 Chitramala.com - Movies, Hollywood, Bollywood, Music, News, Photos, Videos - All rights reserved.

























