Chiranjeevi go for United Andhra?
June 3rd, 2008
ఉప ఎన్నికల ఫలితాలను చిరంజీవి బృందం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. మిశ్రమ ఫలితాలు రావడాన్ని ఆయన సన్నిహితులు నిశితంగా గమనిస్తున్నారు. చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన ఎప్పటినుంచో చేస్తున్నా అది ఆలస్యం అవడానికి ఉప ఎన్నికలు కూడా కొంత కారణమే. రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానాంశంగా వున్న ప్రత్యేక తెలంగాణ డిమాండ్ చిరంజీవి పార్టీకి సవాల్‌గా మారింది. ఈ సంక్లిష్ట అంశంపై ఎలాంటి విధానం అనుసరించాలన్న దానిపై ఆయన సన్నిహితుల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే కోస్తాంధ్రలో ఇబ్బంది తప్పదనీ, సమైక్యాంధ్ర అంటే తెలంగాణలో దెబ్బ తింటామేమోననీ వారు మల్లగుల్లాలు పడుతూ వస్తున్నారు. ఉప ఎన్నికల్లో వచ్చే ఫలితాల్ని బట్టి జనం నాడిని అంచనా వేయొచ్చనీ, దాన్నిబట్టి తెలంగాణ అంశంతో పాటు ఇతర రాజకీయ అంశాలపైనా రాజకీయ నిర్ణయాలు తీసుకోవచ్చనీ వారు భావించారు. అయితే ఉప ఎన్నికల ఫలితాలు వారిని కాస్త అయోమయంలో పడేశాయని తెలుస్తోంది. టిఆర్ఎస్ రాజీనామా చేసిన 16 స్థానాల్లో 9 స్థానాల్ని కాంగ్రెస్, టిడిపి కైవసం చేసుకున్నాయి కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ అంతగా లేదని ఒక వర్గం అంటుంటే, టిఆర్ఎస్‌తో పాటు కాగ్రెస్, టిడిపి కూడా తెలంగాణకు తాము వ్యతిరేకం కాదంటూ ప్రచారాన్ని నిర్వహించాయనీ అందుకే తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్‌తో పాటు వాటికీ ఓట్లేశారనీ మరో వర్గం వాదిస్తోంది. అయితే చిరంజీవికి బాగా పట్టున్న ప్రాంతం కోస్తాంధ్ర కాబట్టి, ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు తగ్గట్లు నడచుకోవడమే శ్రేయస్కరమని ఎక్కువమంది సూచిస్తున్నారు. దాన్నిబట్టి చిరంజీవి సమైక్యాంధ్రకే అనుకూలంగా వ్యవహరిస్తారనే ప్రచారం జరుగుతోంది. 
Give your Rating Here :
Average Rating: 3.88    Votes: 4
 
Featured Most Popular
 
 
Movies Actress Actor Events