Pawan's Banjara Hills house used for party Activities?    
March 26th, 2008
ఉగాదికి రాష్ట్రంలో ఒక కొత్తపార్టీ ఆవిర్భవించనుంది.  అభిమానులు, శ్రేయోభిలాషులు ఎదురుచూస్తున్న ఆపార్టీ మెగాస్టార్ చిరంజీవి పార్టీ. వాస్తవానికి ఆపార్టీకి  సంబందించిన గుర్తులు, పార్టీ పేరు అనధికారికంగా చిరంజీవి తయారు చేసి పెట్టుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఇదంతా బయటపడకుండా చాలా  గోప్యంగా నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే నాగేంద్రబాబు రాష్ట్రమంతా విస్తృత పర్యటన జరిపి అభిమానులను, శ్రేయోభిలాషులను కలుసుకుని వారి అభిప్రాయం  తెలుసుకున్నారు. రాష్ట్రంలో అనేక సంఘాలవారు చిరు రాజకీయాల్లోకి రావాలని కోరుతునే ఉన్నారు. ఆయన మాత్రం తన అభిప్రాయాన్ని ఇంతవరకు వెల్లడించకపోయినా దానికి  సంబందించి కసరత్తు అంతా పూర్తి చేసారు. ఉగాదికి పార్టీ పెడుతున్నట్లు ప్రకటించి ఆపార్టీకి సంబందించిన కార్యక్రమాలన్నీ ఇక బహిరంగం చేయటం మొదలు పెట్టొచ్చు. అయితే చిరంజీవి పెట్టబోయే పార్టీతో పొత్తు  పెట్టుకోవటానికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం  పార్టీతో సహా ఎన్నో రాజకీయ పార్టీలు తహతహ లాడుతున్నాయి. దీనికి కారణం మెగాస్టార్‌కి ఉన్న ఇమేజ్, రాష్ట్రంలో ఆయనకున్న అభిమానుల బలమే. అయితే దీనిపై చిరంజీవి ఎప్పుడూ సమాధానం చెప్పకుండా  దాటవేస్తూ వచ్చారు.

చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్‌కి బంజారాహిల్స్‌లో ఒకపాత ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉండటంలేదు. ఆ ఇంటినే తమ పార్టీ కార్యాలయంగా  ఉపయోగించబోతున్నారు. దానికి సంబందించి కంప్యూటర్లు,  ఫర్నిచర్ తదితర వసతులను సమకూర్చుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక వైద్యుడు ఈ కార్యక్రమాలన్నీ నడుపుతున్నారు. ఈరోజు ఆఇంటిలో ఫర్నీచర్ అంతా  సమకూర్చారు. చిరంజీవి కూతురు పార్టీకి సంబందించిన ఆంతరంగిక కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీకి సంబందించిన బహిర్గత కార్యక్రమాలు అనగా నేతలను కలుసుకోవటం, అభిమానులను టచ్‌లో పెట్టుకోవటం ఇవన్నీ నాగబాబు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా కూడా చిరంజీవి  ప్రత్యక్షంగా ఎవరితోనూ భేటీ కావటం లేదు. రెండు రోజుల క్రితం ఒక ప్రముఖ పత్రికాధినేత చిరంజీవిని ప్రత్యక్షంగా కలుసుకుని రెండుగంటలపాటు సమావేశమైన  అనంతరం ఈ పార్టీకి సంబందించిన కార్యక్రమాలు వేగవంతమయ్యాయి.

ఏదేమైనా ఉగాదికి చిరు పార్టీ రాష్ట్రంలో పురుడుపోసుకోనుంది. ఇప్పటివరకు అందిన  సమాచారం ప్రకారం ఉగాదికి చిరు పార్టీ పెట్టడం ఖాయమని తెలుస్తుంది. అయితే మేలో జరగబోయే ఉప ఎన్నికలలో మాత్రం పోటీ చేస్తారా లేదా అన్నది    అనుమానమే. ఒక రాజకీయపార్టీ పెట్టడానికి ఇంత గోప్యంగా వ్యవహరించిన సందర్భం రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేదు.  దీనికి చిరంజీవి భయపడుతున్నాడా అనుకోవాలా, లేక  ప్రజల స్పందన తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవాలా అనేది  ఉగాది తర్వాత గాని మనకు తెలియదు. అప్పటివరకు చిరంజీవి అభిమానులకు ఈనిరీక్షణ తప్పదు. చిరంజీవి రాజకీయ పార్టీకి ముహూర్తపు షాట్ మాత్రం ఉగాది అని చెప్పవచ్చు.
Give your Rating Here :
Average Rating: 3.38    Votes: 24
 
Featured Most Popular
 
 
Movies Actress Actor Events