
Chiru 'Prachara Ratham' getting ready?
April 5th, 2008
ఉగాదికి చిరంజీవి పార్టీ ప్రకటన దాదాపు లేనట్లేనని తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు ఏప్రిల్ నెలాఖరు లేదా మే తొలి వారంలో ఆ ప్రకటన వుండే అవకాశముంది. పార్టీ ప్రచారం నిమిత్తమే చిరంజీవి ఇప్పటికే ఒక హెలికాప్టర్‌ను కొనుగోలు చేసిన సంగతిని చిత్రమాల వెల్లడించిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన ఒక 'ప్రచార రథం'ను కూడా తయారు చేయిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన బస్సుకు ముంబైలో రూపకల్పన జరుగుతోంది. ఇటీవల టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు కొనుగోలు చేసిన బస్సు తరహాలోనే ఈ బస్సులోనూ అన్నిరకాల సౌకర్యాలు ఉంటాయని తెలుస్తోంది. హెలికాప్టర్‌తో బాటు ఈ ప్రచార రథాన్ని కూడా చిరంజీవి వినియోగించనున్నారు. కాగా పార్టీ ప్రకటనను చిరంజీవి ఎందుకు వాయిదా వేసుకున్నారనే దానికి స్పష్టమైన కారణాలు వెల్లడికాలేదు. అయినప్పటికీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన పలువురు నాయకులు చిరంజీవి పట్ల అభిమానాన్ని బాహాటంగా వ్యక్తీకరిస్తూ ఆయన పార్టీలో చేరే సంకేతాలిస్తున్నారు. చిరంజీవి ఎప్పుడు పార్టీ ప్రకటన చేస్తారా.. అని వారంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
| Give your Rating Here : |
Average Rating: 3.81
Votes: 18
|
News | Box Office | Previews | Reviews | Trailers | Galleries | Wallpapers | Events | Videos | Audio Songs
©2006 - 2008 Chitramala.com. All rights reserved.


























