
Nagarjuna getting afraid of TV channel
June 25th, 2008
టాప్ హీరో నాగార్జున ఇప్పుడు ఒక తెలుగు చానల్‌ను చూసి భయపడి పోతున్నారు. అది జీ తెలుగు చానల్. అలాగని అదేమీ ఆయనకు వ్యతిరేక ప్రచారాన్ని చేయడం లేదు. రోజు రోజుకూ పెరుతుగున్న ఆ చానల్ పాపులారిటీ ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆయన ప్రస్తుతం మా టీవీకి అధినేత అనే సంగతి తెలిసిందే. 2008 ఆరంభం నుంచీ జీ తెలుగు చానల్ ప్రసారం చేస్తున్న కొత్త కొత్త సినిమాలు, డాన్స్ షోలు, మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఆ చానల్‌కు అమిత ప్రాచుర్యాన్ని కల్పిస్తూ వస్తున్నాయి. వీక్షకుల సంఖ్యను అనూహ్యంగా పెంచుతూ వస్తున్నాయి. దాంతో కొద్ది వారాలుగా నాగార్జున అశాంతిగా వుంటున్నారనీ, సరిగా నిద్ర పోలేక పోతున్నారనీ అంతర్గత వర్గాలు చెప్పుకుంటున్నాయి. సాధారణంగా వేసవిలో వీక్షకుల సంఖ్య పెరగడం వల్ల టీవీ చానళ్ల టిఆర్‌పిలు పెరుగుతాయి. ఆశ్చర్యకరంగా ఈ వేసవిలో మాటీవీ కార్యక్రమాల టిఆర్‌పిలు సాధారణ స్థాయిలోనే నమోదయ్యాయి. అంటే అది వీక్షకుల సంఖ్యను పెంచుకోలేక పోయింది. సుహాసిని ప్రయోక్తగా అది ప్రారంభించిన క్విజ్ షో 'బొమ్మరిల్లు' సైతం వీక్షకుల్ని ఆకట్టుకోవడంలో అంతగా సఫలం కాలేక పోతోంది. ఎప్పుడూ చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్ సినిమాలనే ప్రదర్శిస్తూ రావడం వల్ల వీక్షకులు బోరెత్తి పోతున్నారు. ఇప్పటిదాకా అధిక జనాదరణ కలిగి, నెంబర్ వన్ స్థానంలో వున్న జెమిని టీవీనే తనకు ప్రధాన పోటీదారుగా మాటీవీ పరిగణిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు జీ తెలుగు దానికి పక్కలో బల్లెంగా తయారైంది. అది ప్రసారం చేస్తున్న కొత్త, క్రేజీ సినిమాలు, 'ఆట' వంటి డాన్స్ షోలూ, 'సరిగమప' వంటి సంగీత ఆధార కార్యక్రమాలూ సూపర్ సక్సెసయ్యి, దాని వీక్షకుల సంఖ్యను అమాంతం పెంచేశాయి. ఇటీవల అది సిద్ధార్థ్ సినిమా 'ఆట'ని ప్రసారం చేయగా, అది అథిక టిఆర్‌పిని సాధించింది. త్వరలో 'దుబాయ్ శీను', 'తులసి' వంటి హిట్ సినిమాల్ని అది ప్రసారం చేయబోతోంది. సో.. ఇప్పుడు దాని తాకిడిని ఎలా తట్టుకోవాలా.. అని నాగార్జున తలబద్దలు కొట్టుకుంటున్నారు.
| Give your Rating Here : |
Average Rating: 1.83
Votes: 3
|
News | Box Office | Previews | Reviews | Trailers | Galleries | Wallpapers | Events | Videos | Audio Songs
©2006 - 2008 Chitramala.com. All rights reserved.


























