
Now the new ADHINAYAKUDU is.. Nagababu!
May 4th, 2008
చిరంజీవి హీరోగా త్వరలో 'అధినాయకుడు' అనే సినిమా రూపొందనున్నదని ఇంతదాకా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పరుచూరి బ్రదర్స్ ఇప్పటికే దానికి సంబంధించి స్క్రిప్ట్ సిద్ధం చేశారు. కె. రాఘవేంద్రరావు, అశ్వనీదత్, అల్లు అరవింద్ దానికి నిర్మాతలు. దర్శకుడిగా ఎన్. శంకర్ దాదాపు ఖరారయ్యాడు. అయితే ఉన్నట్లుండి ఆ ప్రాజెక్టులో అనూహ్యమైన మార్పు సంభవించింది. చిరంజీవి ఆంతరంగిక వర్గాల సమాచారం ప్రకారం 'అధినాయకుడు'లో చిరంజీవి నటించబోవడం లేదు. ఆ స్థానంలో నాగబాబు వచ్చారు. అంటే 'అధినాయకుడు'గా తెరమీద నాగబాబు అభినయించబోతున్నారు. నమ్మశక్యం కాకపోయినా ఇప్పుడు ఈ సంగతే ప్రచారంలోకి వచ్చింది. ఈ సమాచారంతో ఫిల్మ్‌నగర్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చిరంజీవి కొంతకాలంపాటు సినిమాలకు దూరమై, పూర్తిగా రాజకీయాల మీదే శ్రద్ధ వహిస్తారనేది చిత్రమాలకు అందిన సమాచారం. అయితే చిరంజీవి ఎంతకాలం సినిమాలకు దూరంగా వుంటారనే సంగతి మాత్రం వెల్లడి కాలేదు. కనీసం 2009 సార్వత్రిక ఎన్నికల దాకా ఆయన సినిమాల్లో నటించకపోవచ్చని వినికిడి. ఒక వర్గం సమాచారం ప్రకారం చిరంజీవినీ, ఆయన రాజకీయ పార్టీనీ హైలైట్ చేసేవిధంగా 'అధినాయకుడు'ను రూపొందించనున్నారు. ఇంతదాకా చిరంజీవి కోసం తయారు చేసిన సబ్జెక్టును తాజాగా నాగబాబు బాడీ లాంగ్వేజ్‌ని దృష్టిలో వుంచుకుని మార్పులు చేర్పులు చేయనున్నారు. ఇప్పటికే చిరంజీవి అభిమానులు ఎలా నడచుకోవాలో చెప్పే కథాంశంతో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా నిర్మాణమవుతున్నదనీ, దానిలో కూడా నాగబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారనీ ఇటీవలే చిత్రమాల తొలిసారిగా బయటపెట్టిన సంగతి విదితమే. దానికి 'అన్న కోసం' (లేదా అన్నయ్య కోసం) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
| Give your Rating Here : |
Average Rating: 2.50
Votes: 3
|
News | Box Office | Previews | Reviews | Trailers | Galleries | Wallpapers | Events | Videos | Audio Songs
©2006 - 2008 Chitramala.com. All rights reserved.



























