NTR says 'no' to Vinayak
July 1st, 2008
మరోసారి దర్శకుడు వివి వినాయక్‌కు హీరో ఎన్టీఆర్ నుంచి నిరాకరణ ఎదురైంది, కథ విషయంలో. ఏప్రిల్‌లోనే ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్‌లో మూడో సినిమా లాంఛనంగా మొదలైంది. అయితే ఇంతదాకా అది సెట్స్ మీదకు వెళ్లలేదు. కారణం కథ ఫైనల్ కాకపోవడం. మునుపటి సినిమా 'కంత్రి' బాక్సాఫీసు వద్ద అనుకున్నట్లు ఆడకపోవడంతో 'యమదొంగ'తో మళ్లీ గాడిలో పడిందనుకున్న కెరీర్ మళ్లీ ఇరుకున పడినట్లు భావించాడు ఎన్టీఆర్. 'కంత్రి' సరిగా జనాదరణ పొందక పోవడానికి గల కారణాల్ని విశ్లేషించుకున్న అతను ఈసారి ఎలాంటి పొరపాట్లకూ తావివ్వరాదనే పట్టుదలతో వున్నాడు. అందుకే ఇదివరకు ఓసారి వినాయక్ వినిపించిన కథ నచ్చలేదని చెప్పాడు. దాంతో జూన్ నాటికి మరో స్క్రిప్టును తయారుచేసి, ఎన్టీఆర్‌ను ఒప్పించాలని అనుకున్నాడు వినాయక్. అందుకే జూలై 10 నుంచి షూటింగ్ మొదలు పెట్టాలని కూడా భావించారు. వినాయక్ సొంతంగా ఒక కథనీ, దర్శక రచయిత దశరథ్ ఒక కథనీ రాసుకుని, ఆ రెండింటినీ మేళవించి మరో కథని తయారు చేశారు. దాన్ని ఇటీవల ఎన్టీఆర్‌కు వినిపించారు. విన్న వెంటనే 'అబ్బే ఏమీ బాగోలేదు వినయ్' అని చెప్పేశాడు ఎన్టీఆర్. 'ఇలాంటి పాత కథ కాదు. నాకు కొత్తగా వుండాలి. ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను' అని స్పష్టం చేశాడు. దాంతో మళ్లీ కథల వంటకం మొదలుపెట్టారు వినాయక్ అండ్ కో. సో.. జూలై 10న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు లేవు. బహుశా ఈ నెలాఖరులోనో, ఆగస్టు తొలి వారంలోనో షూటింగ్ మొదలుకావచ్చు, అదీ కథ ఫైనలైజ్ అయితేనే! 
Give your Rating Here :
Average Rating: 4.07    Votes: 7
 
Featured Most Popular
 
 
Movies Actress Actor Events