Purandheswari wants NTR to stay away!
June 9th, 2008
నందమూరి వంశంలో తననూ సభ్యుడిగా భావిస్తున్నందుకు మామయ్య చంద్రబాబునాయుడు, బాబాయ్ బాలకృష్ణ, సవతి సోదరుడు కల్యాణ్‌రామ్‌లకు ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తన కొత్త సినిమా ఓపెనింగ్‌కు బాబాయ్, అన్న వచ్చినందుకు సంబరపడ్డాడు. దివంగత ఎన్టీఆర్ జన్మదిన వేడుకలో తనకూ గౌరవం లభించినందుకు పొంగిపోయాడు. కానీ అతడికి ఆ సంతోషం కొద్దిసేపే వుందని తెలిసింది. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా జరిగిన రక్తదాన శిబిరంలో ఎన్టీఆర్ రెండో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బాలకృష్ణ, రామకృష్ణ, కల్యాణ్‌రామ్ వంటివాళ్లు కనిపించినా జూనియర్ ఎన్టీఆర్ జాడ కానరాలేదు. తమ కుటుంబానికి అతడిని మరీ సన్నిహితంగా మెలగకుండా చూడాలని రామకృష్ణకు స్వయంగా హరికృష్ణ ఫోన్‌చేసి తెలిపారు. దాంతో రక్తదాన శిబిరం నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఎన్టీఆర్‌కు సున్నితంగా చెప్పారు రామకృష్ణ. దీనికి మొదట ఇబ్బందిపడ్డ ఎన్టీఆర్, తర్వాత తనను మరికొంతసేపు అక్కడ వుండనివ్వాల్సిందిగా బాలకృష్ణ, కల్యాణ్‌రామ్‌లను వేడుకున్నాడు. అలా కాసేపు అక్కడ గడిపాక అక్కడినుంచి బాధగా వెళ్లిపోయాడు. అతడిని అలా నందమూరి కుటుంబానికి దూరంగా వుంచమని హరికృష్ణ మీద ఒత్తిడి తెచ్చింది ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మంత్రి అయిన పురందేశ్వరి అని ఇన్‌సైడర్స్ చెప్పుకుంటున్నారు. తమ కుటుంబ పరువు ప్రతిష్ఠలను దృష్టిలో వుంచుకుని ఎన్టీఆర్‌ను దూరంగా వుంచడం మంచిదని ఆమె తన సోదరులకు చెప్పారనేది వారి మాట.   
Give your Rating Here :
Average Rating: 0    Votes: 0
 
Featured Most Popular
 
 
Movies Actress Actor Events