
Siddharth, Soha break-up?
May 31st, 2008
'రంగ్ దే బసంతి' కాలం నుంచి సిద్ధార్థ్, సోహా అలీఖన్ (సయీఫ్ అలీఖాన్ చెల్లెలు) మధ్య ప్రేమాయణం నడుస్తోంది. అయితే ఆ ఇద్దరూ నలుగురి కళ్లలో పడకుండా గుంభనంగా తమ అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఎప్పుడైనా కలిసి ఎవరికంటైనా పడినా 'మేం మంచి స్నేహితులం' అని మాత్రమే చెప్పేవాళ్లు. అయితే వారి సన్నిహితులు, స్నేహితులతో పాటు బాలీవుడ్ జనాలందరికీ ఆ ఇద్దరూ ప్రేమలో వున్నారనే సంగతి తెలుసు. కొన్ని నెలల క్రితం సిద్ధార్థ్‌ను తన తల్లిదండ్రులు టైగర్ పటౌడీ, షర్మిలా ఠాగూర్, అన్న సయీఫ్‌కు పరిచయం చేసింది సోహా. తమ ప్రేమకు వాళ్లనుంచి అంగీకారాన్ని కూడా పొందిందని కూడా చెప్పుకుంటారు. అయితే వారి సన్నిహిత వర్గాల తాజా సమాచారం ప్రకారం ఆ ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. 'మాగ్జిమ్' మ్యాగజైన్ కోసం సోహా జరిపిన ఫోటోషూట్ దీనికి ప్రధాన కారణమని వినిపిస్తోంది. ఆ ఫోటోషూట్‌లో సోహా అర్ధనగ్న స్టిల్స్ పట్ల సిద్ధార్థ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడనీ, అతడి స్పందన పట్ల సోహా అసౌకర్యంగా ఫీలై, అతడితో అనుబంధానికి ఫుల్‌స్టాప్ పెట్టి స్వేచ్ఛ పొందాలని భావిస్తున్నదనీ తెలుస్తోంది. ఇప్పటిదాకా తనమీదున్న పక్కింటమ్మాయి ఇమేజ్‌ను వదిలి సెక్సీ ఇమేజ్‌ను ఆమె కోరుకుంటోంది. లేకపోతే తనకు అవకాశాలు రావట్లేదనేది ఆమె భావన. ఇదే సిద్ధార్థ్‌కు గిట్టడం లేదు. అందుకే కొంతకాలం నుంచి ఆ ఇద్దరి మధ్య మాటలు కూడా లేవు. దాన్నిబట్టి చూస్తే వారు విడిపోయారనే అనిపిస్తోంది.
| Give your Rating Here : |
Average Rating: 4.83
Votes: 3
|
News | Box Office | Previews | Reviews | Trailers | Galleries | Wallpapers | Events | Videos | Audio Songs
©2006 - 2008 Chitramala.com. All rights reserved.


























