Tabu attracts NBK
June 18th, 2008
దర్శకుడు కె రాఘవేంద్రరావు ఇదివరకు రూపొందించిన భక్తి చిత్రాల్లో 'అన్నమయ్య' హిందీలో అనువాదమై, హిందీ ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు ఆయన మరో చిత్రం 'శ్రీరామదాసు' హిందీలో 'శ్రీరామమందిర్' అనువాదమైంది. త్వరలో విడుదల చేయడానికి నిర్మాత కొండా కృష్ణంరాజు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆయన తాజా చిత్రం 'పాండురంగడు'ను కూడా హిందీలో అనువదించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ, టాబు, స్నేహ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలోని ప్రధాన పాత్ర పుండరీక రంగనాథుడిది మహారాష్ట్రలోని పండరీపురం. అందువల్ల హిందీలో అనువాదమైతే మరాఠీలు ఈ సినిమాను బాగా ఆదరిస్తారని రాఘవేంద్రరావు భావిస్తున్నారు. ఈ సినిమాను ఆయన సొంత నిర్మాణ సంస్థ ఆర్‌కే అసోసియేట్స్ నిర్మించింది. పైగా టాబుకి బాలీవుడ్‌లో చక్కని ఆదరణ వుంది. ఈ సినిమాలో బాలకృష్ణ తర్వాత ఎక్కువమందిని ఆకట్టుకున్నది ఆమె పాత్రే. అమృత అనే వేశ్య పాత్రలో ఆమె చేసిన స్కిన్ షో మహిళలకి ఇబ్బంది కలిగిస్తే యువతకు కిర్రెక్కించింది. దీన్ని సొమ్ము చేసుకోవాలని కూడా రాఘవేంద్రరావు ఆశిస్తున్నారు. ఆ సంగతలా వుంచితే 'పాండురంగడు' సెట్స్ మీద టాబు అందచందాలకూ, వంపుసొంపులకూ బాలకృష్ణ దాసోహమయ్యాడని ఫిల్మ్‌నగర్‌లో ప్రచారమవుతోంది. ఇదివరకు ఆ ఇద్దరూ 'చెన్నకేశవరెడ్డి'లో నటించినా, అందులో టాబు స్కిన్ షో చేయలేదు. 'పాండురంగడు'లో మాత్రం ఆమె ఒళ్లు దాచుకోకుండా నటించిన సంగతి మనకు తెలుసు. ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన బాలయ్య 'నేను బ్రహ్మచారినైతే మరో ఆలోచన లేకుండా నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణే' అని టాబుతోటే అన్నట్లు చెప్పుకుంటున్నారు. ఆ ప్రచారంలో నిజమెంత అనే సంగతి అలా వుంచితే టాబు చేసిన పాత్ర మాత్రం ఆ తీరునే వుందని అందరూ అంగీకరిస్తున్నారు. అంతా చేసి ఆమె వయసు 37 సంవత్సరాలు! నేటి 'కంత్రి' తార హన్సిక కంటే 20 యేళ్లు ఎక్కువ!
Give your Rating Here :
Average Rating: 4.50    Votes: 1
 
Featured Most Popular
 
 
Movies Actress Actor Events