A boy’s mega run for chiranjeevi
Saturday, February 16th, 2008 at 8:11 am
మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగప్రవేశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు సందడి చేస్తున్న నేపధ్యంలో ఒక చిన్నారి కూడా తన వంతు బుడత సాయం చేయనున్నాడు. చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించాలని కోరుతూ విశాఖపట్టణం నుంచి హైద్రాబాద్ వరకూ 600 కిలోమీటర్ల రన్ ఈ చిన్నారి చేపట్టనున్నాడు. విశాఖపట్టణం జిల్లా మాడుగుల నివాసి అయిన 12 ఏళ్ల సాయినాధ్ చిరంజీవి వీరాభిమాని. ఇటీవల కాలంలో చిరంజీవి రాజకీయ రంగప్రవేశం గురించి వస్తున్న వార్తలతో ప్రభావితమైన సాయినాథ్ ఇందుకు తనవంతుగా ప్రచారం చేయాలని నిర్ణయించుకుని ఈ భారీ రన్ ఆలోచనకు వచ్చాడు. ఈ నెల 17న ప్రారంభమయ్యే ఈ రన్ 20 రోజులపాటు సాగుతుంది. దారిలో చిరంజీవికి అనుకూలంగా కోటి సంతకాలు సేకరించాలని, ఒక్కో అభిమాని వద్ద నుంచి ఒక్కో రూపాయి సేకరించి మెగాస్టార్ చేతుల మీదుగా వికలాంగులకు అందచేస్తానని సాయినాథ్ అంటున్నాడు. సాయినాథ్‌కు అందరూ  శుభాకాంక్షలాందచేస్తున్నారు.
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5 out of 5)
Loading ... Loading ...

Post Your Comment

 
Featured Most Popular
 

Who talks lot of crap and irritates you ?


Loading ... Loading ...
 
Movies Actress Actor Events