మెగా పార్టీపై ఇంటెలిజెన్స్ నిఘా
Sunday, February 3rd, 2008 at 12:32 pm

మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగప్రవేశంపై రాష్ట్రంలోని నిఘా విభాగాలు క్షుణ్ణంగా ఆరా తీస్తున్నాయి. ఆయన కనుక పార్టీ పెడితే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయన్న విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలు కూపీ లాగుటున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదేశాల మేరకు నిఘా వర్గాలు రంగంలోకి దిగినట్టు చెబుతున్నారు. యువకులు,మహిళలు,రైతులు చిరంజీవి పార్టీ పట్ల ఎటువంటి ఆసక్తి కనబరుస్తున్నారు అనే అంశాన్ని పరిశీలించేందుకు నిఘా వర్గాలు కృషి చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో పరిశీలించి మూడురోజుల్లో నివేదిక పంపాలని ఆదేశాలు
అందడంతో ఆ అంశాలపై నిఘా వర్గాలు దృష్టి సారించినట్టు చెబుతున్నారు. అలాగే, పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకులు ఎవరైనా చిరంజీవి పార్టీలోకి వెళ్లే అవకాశాలను కూడా నిఘావర్గాలు సునిశితంగా అధ్యయనం చేస్తున్నాయి.