Chiranjeevi eyes on media field
Friday, June 20th, 2008 at 11:50 pm
త్వరలో రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమవుతున్న అగ్ర సినీ హీరో చిరంజీవి మీడియా రంగం మీదా చూపు సారిస్తున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి అండగా ఒకవైపు ఈనాడు, మరోవైపు ఆంధ్రజ్యోతి దిన పత్రికలు పనిచేస్తుండగా, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి స్వయంగా సాక్షి దిన పత్రిక వుంది. దాంతో మీడియాలో తనకు ఆలంబనగా ఒక దిన పత్రిక, ఒక టీవీ చానల్‌ను ఏర్పాటు చేసుకోవాలని చిరంజీవి సంకల్పించారు. ఇదివరకే ఆయన సూర్య దిన పత్రికను సొంతం చేసుకోవాలని ఆ దినపత్రిక ఛైర్మన్ నూకారపు సూర్యప్రకాశరావుతో సంప్రదింపులు జరిపారు. అయితే అవి ఒక కొలిక్కి రాలేదు. చిత్రమాలకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్రంలో పేరెన్నికగన్న అగ్రగామి పారిశ్రామిక, కార్పొరేట్ సంస్థ జిఎమ్ఆర్ మీడియా రంగంలో చిరంజీవితో చేతులు కలిపేందుకు ఉత్సాహం చూపిస్తోంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును నిర్మించింది ఈ సంస్థే. ప్రస్తుతం ఆ సంస్థకూ, చిరంజీవికీ మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇరు వర్గాల చర్చలు ఫలిస్తే సమీప భవిష్యత్తులోనే చిరంజీవి ఒక దిన పత్రికనూ, ఒక టీవీ చానల్‌నూ ప్రారంభించే అవకాశాలున్నాయి. వాటికి జిఎంఆర్ నిధుల్ని సమకూరిస్తే, చిరంజీవి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారనేది సమాచారం. 
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (7 votes, average: 3.43 out of 5)
Loading ... Loading ...

Post Your Comment

 
Featured Recommended
 
Specials
 
Movies Actress Actor Events