Chiranjeevi selected Green as his party colour
Monday, April 7th, 2008 at 11:28 pm

కాంగ్రెస్ పార్టీ జెండాలో మువ్వన్నెలుంటాయి. బిజెపిది కాషాయం, ఆకుపచ్చ. తెలుగుదేశం పార్టీ రంగు పసుపు. టిఆర్ఎస్ పార్టీది గులాబీ రంగు. మరైతే త్వరలో వెలుగు చూడబోతున్న చిరంజీవి పార్టీది ఏ రంగు? ఇది ఆసక్తికరమైన అంశం. చిరంజీవి తన పార్టీ కోసం ఏ రంగును ఎంచుకోబోతున్నారనే సంగతి కొంతకాలంగా వివిధ రాజకీయ పక్షాలతో బాటు ఆయన అభిమానుల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. చిత్రమాలకు అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన చిలకపచ్చ రంగును తన పార్టీ కోసం ఎంచుకున్నారు. రాష్ట్రమంతా పచ్చగా కళకళలాడాలనీ, సామాన్యుల జీవితాలు సైతం పచ్చగా వుండాలనే ఆశయానికి చిహ్నంగా ఆ రంగును ఎంచుకున్నారని తెలుస్తోంది. కాగా పార్టీ పేరు ఇంకా ఖరారు కాలేదని సమాచారం.


(6 votes, average: 4.33 out of 5)

























