Chiranjeevi in Chennai
Saturday, February 9th, 2008 at 12:00 am
అగ్ర నటుడు చిరంజీవి ప్రస్తుతం చెన్నైలో వున్నారు. అక్కడ ఆయన కొంతమంది సన్నిహితులు, హితులతో చర్చలు జరుపుతున్నారు. ఆ చర్చలు ఆయన రాజకీయ రంగప్రవేశానికి సంబంధించినవేనని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్‌కు చెందిన కొంతమంది ఆంతరంగికులతో బాటు చెన్నైకి చెందిన మరికొంతమంది కూడా ఈ చర్చల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. ఇందులో పార్టీ గురించి, పార్టీ పెట్టాక అమల్లోకి తేవాల్సిన ప్రణాళిక గురించీ మాట్లాడుకుంటున్నారని తెలుస్తోంది. హైదరాబాద్‌లో అయితే మీడియా వేయికళ్లతో గమనిస్తున్నదనీ, అందుకే ఈ సమావేశాలు చెన్నైలో జరుపుతున్నారనీ అనుకుంటున్నారు. ఫిబ్రవరి 12 వరకు ఈ చర్చలు కొనసాగుతాయని సమాచారం. ఆ తర్వాత 13న చిరంజీవి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.




























