Petition filed against Pawan, Chiru ?
Friday, March 7th, 2008 at 8:38 pm

విశాఖపట్నంలోని మొదటి అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేటు కోర్టు తీర్పును సవాలు చేస్తూ శుక్రవారం (మార్చి 7) పవన్ కళ్యాణ్ భార్య నందిని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు వాస్తవాన్ని పరిగణనలోనికి తీసుకోలేదని, రెండో పెళ్ళికి తగిన సాక్ష్యాధారాలు లేవన్న ఉద్దేశ్యంతో మేజిస్ట్రేటు కేసును కొట్టివేసారని, వాస్తవానికి పవన్ కళ్యాణ్, రేణు దేశాయిలు కలిసి కాపురం చేస్తున్నారని అన్నారు. ఆమె కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రతివాదులలో మొదటి ముద్దాయిగా పవన్ కళ్యాణ్‌ను, 5వ ముద్దాయిగా చిరంజీవిని, 11 వ ముద్దాయిగా అల్లు అరవింద్‌లను పేర్కొన్నారు. ఒకపక్క విశాఖ ఫ్యామిలీ కోర్టులో విడాకులు, మనోవర్తి కేసులు నడుస్తున్నాయి. దీనిపై తాజాగా ఈరోజు హై కోర్టులో నందిని, పవన్ కుటుంబీకులను ప్రతివాదులుగా పేర్కొంటూ కేసు దాఖలు చేయటం విశేషం. హైకోర్టు ఈకేసును ఈనెల 10న విచారణను ప్రారంభించనున్నది.





























