Chiranjeevi to establish representative committee
Sunday, June 22nd, 2008 at 4:02 pm
ఇటీవలి కాలంలో చిరంజీవిని విమర్శించే వారి సంఖ్య క్రమేణా పేరుగుతోంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌కు చెందిన నాయకులు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా చిరంజీవి పెద్ద తాగబోతంటూ మార్కెటింగ్ మంత్రి మారెప్ప చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఇలాంటి వారి విమర్శలకు ధీటైన జవాబివ్వడానికీ, విలేఖర్ల సమావేశ నిర్వహణ, పత్రికా ప్రకటనల విడుదలతో పాటు పార్టీ కోసం ఏర్పాటు చేసే సదస్సులు, సమావేశాల్లో పాల్గొనే ప్రతినిథుల బృందాన్ని ఏర్పాటు చేయడానికి చిరంజీవి కసరత్తు మొదలుపెట్టారు. ఈ బృందాన్ని పార్టీకి రక్షణ కవచంలా తయారు చేయాలని ఆయన భావిస్తున్నారు. నేర చరిత్రలేని, మాటకి మాట బలంగా చెప్పగలిగే వ్యక్తులకోసం ఆయన అన్వేషిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే ఈ ప్రతినిథి బృందం తయారవనున్నది. గమనించదగ్గ అంశమేమంటే తన మీద వచ్చే విమర్శలు, వ్యాఖ్యలకు చిరంజీవి సమాధానమివ్వరు. ఆ బృందమే స్పందిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ వుంటుంది కాబట్టి రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమేననీ, అయితే తాను మాత్రం అలా ఒకరిపై ఉత్త పుణ్యానికే బురద చల్లడం చేయకూడదనీ చిరంజీవి నిర్ణయించుకున్నారు. ఏ రాజకీయ నాయకుడినీ విమర్శించవద్దనీ, అభిమానుల భావోద్వేగాలు రెచ్చగొట్టే రీతిలో వారివద్ద ప్రసంగాలు చేయవద్దనీ సోదరుడు నాగబాబు, బావమరిది అల్లు అరవింద్‌లకు కూడా ఆయన గట్టి సూచన ఇచ్చారని తెలిసింది.
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (8 votes, average: 3.5 out of 5)
Loading ... Loading ...

One Response to “Chiranjeevi to establish representative committee”

  1. krishna Says:

    It is a good thought because chiranjeevi is coming into politics to serve people and change present politics not to answer all bleady comments made by present politicians. Due to this repesentative committee establishment chiranjeevi will have more time to think of people and their welfare.

Post Your Comment

 
Featured Most Popular
 

Should Chiranjeevi start Criticizing and Respond strongly to any personal attacks on him ?


Loading ... Loading ...
 
Movies Actress Actor Events