చిరుకి అప్రతిష్ఠ తేవడానికే పుకార్లు?
Friday, February 1st, 2008 at 11:53 pm
చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ ‘చిరుత’ హీరోయిన్ నేహాశర్మని పెళ్లి చేసుకున్నాడంటూ శుక్రవారం ఒక్కసారిగా వెలువడిన పుకార్లు చిరంజీవినే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పుకార్ల ద్వారా ఆయనకు అప్రతిష్ఠ తేవడం వాటిని వ్యాప్తిలోకి తెచ్చినవాళ్ల వుద్దేశమని వారు చెబుతున్నారు. నిజానికి ‘చిరుత’లో నటించేప్పుడే నేహకు బాయ్‌ఫ్రెండ్ వున్నాడనీ, ఆ సినిమా షూటింగుకి సైతం ఆమెతో కొన్నిసార్లు అతను కూడా వచ్చాడనీ ఆ సినిమా యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మూడు రోజుల క్రితమే నటుడు రాజశేఖర్‌పై చిరంజీవి అభిమానులుగా చెప్పుకుంటున్నవారు దాడి చేయడంతో అది చిరంజీవికి ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఆ వివాదం పూర్తిగా చల్లారకముందే ఇలాంటి పుకార్లు రావడం గమనార్హం. నటులనే వాళ్లకి ఇలాంటివి మామూలే అని రామ్‌చరణ్ కొట్టివేసినా ఈ పుకార్లు అతను చిరంజీవి కుమారుడు కావడం వల్లే వచ్చాయని చాలామంది నమ్ముతున్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నాడనే వార్తలు మొదలైనప్పటినుంచీ ఏదో ఒక అపశృతిని ఆయన క్రమం తప్పకుండా ఎదుర్కొంటూ రావడం గమనార్హం. 
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (Please Rate this Story)
Loading ... Loading ...

Post Your Comment

 
Featured Recommended
 
Specials
 
Movies Actress Actor Events