చిరుతో కాంగ్రెస్‌కు ముప్పు
Thursday, January 31st, 2008 at 10:07 am
సినీనటుడు చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టినట్లయితే అందులో చేరాలని నిర్ణయిచుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోక్‌సభ సభ్యుడు చేగొండి హరిరామజోగయ్య ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తూ ఒక లేఖ రాశారు. చిరంజీవి పార్టీ పెట్టాలన్న అభిప్రాయానికి రావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు. చిరంజీవి రెండవ కూతురు వివాహం విషయంలో కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన పాత్ర చిరంజీవికి ఆవేదనను కలిగించాయని పేర్కొన్నారు. రాకశేఖర్‌పై జరిగిన దాడిలో కూడా కాంగ్రెస్ నాయకులు అతిగా వ్యవహరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో అవనీతి పెరిగిపోయిందని, అందుకే చిరంజీవి రాజకీయాలలోకి వస్తున్నారని సోనియాకు రాసిన లేఖలో జోగయ్య చెప్పారు.




























