చిరు ఫాన్స్ గాంధీగిరి
Wednesday, January 30th, 2008 at 8:10 pm
రాజశేఖర్‌పై దాడి చేసి చెడ్డ పేరు తెచ్చుకున్న చిరంజీవి అభిమానులు ఇమేజ్ రిపేర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని రాజమండ్రికి చెందిన చిరంజీవి అభిమానులు గులాబీ పువ్వులు చేత బట్టుకుని శాంతి ర్యాలీ నిర్వహించారు. రక్తదాన, నేత్ర దాన కార్యక్రమాలతో ప్రజలకు ఎన్నో సేవలు అందించిన చిరంజీవి అభిమానులు ఆవేశకావేశాలు విడిచి పెట్టి తమ నాయకుడు బోధించిన శాంతి మార్గాన్ని విడిచిపెట్టబోమని ప్రతిజ్ఞ చేశారు. చిరంజీవి అభిమానులయిన అందరూ శాంతియుత పద్ధతులను విడిచి పెట్టకుండా ఉంటే బాగుంటుందని ర్యాలీలో పాల్గొన్న అభిమానులు కోరారు.



























