Chiru fans wants title change
Thursday, February 28th, 2008 at 12:00 am
రాజకీయ పార్టీ ప్రకటనకంటే ముందుగా ప్రారంభం కానున్న చిరజీవి సినిమాకి ‘అధినాయకుడు’ అనే పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంతో రూపొందే ఈ సినిమాకి దర్శకుడి పేరు ఇంకా ఖరారు కాలేదు. కృష్ణవంశీ, ఎన్. శంకర్ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా ఆ సినిమాకి ‘అధినాయకుడు’ కాకుండా ‘నా పిలుపే ప్రభంజనం’ అనే టైటిల్‌ని పరిశీలించాల్సిందిగా చిరంజీవి అభిమానులు కోరుతున్నారు. రాజకీయ పార్టీ పెడుతున్న తరుణంలో ఆ టైటిల్ అయితే ప్రజల్ని బాగా ఆకర్షిస్తుందనీ, యాప్ట్‌గా వుంటుందనీ వారు అభిప్రాయపడుతున్నారు. ‘నా పిలుపే ప్రభంజనం’ (1986) పేరుతో ఇదివరకు కృష్ణ నటించిన సినిమా పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే.



























