చిరంజీవి ని రెచ్చగొట్టొద్దు: మొయిలి
Thursday, January 31st, 2008 at 5:37 pm

చిరంజీవి వ్యక్తిగత అంశాలకి, పార్టీకి లింకు పెట్టవద్దని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ జోగయ్యకు సలహా ఇచ్చారు. చిరంజీవి కుమార్తె పెళ్లి వెనుక కాంగ్రెస్ నేతల హస్తం ఉందనే జోగయ్య ఆరోపణల పట్ల స్పందిస్తూ ఆయన పై విధంగా అన్నారు. అయినా ఇది పార్టీ అంతర్గత వ్యవహారం అని, దానిని తాము పరిష్కరించుకుంటామని, చిరంజీవి ని రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేయవద్దని ఆయన మీడియాకు హితవు పలికారు. జోగయ్య వ్యాఖ్యల వల్ల రేపు చిరంజీవి పార్టీ పెడితే కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందా అన్న ప్రశ్నకు ఎవరో ఇద్దరు ముగ్గురు వ్యక్తుల వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం జరగదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ను నడిపిస్తున్నది వైఎస్ అన్న జోగయ్య కామెంట్స్ ని మొయిలి కొట్టిపారేశారు. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కాదని, అధిష్టానమే అల్టిమేట్ అని ఆయన చెప్పారు. చిరంజీవి పెడతారని తాను అనుకోవడం లేదని, పెట్టకపోవడమే మంచిదని మొయిలి అన్నారు.
 
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (Please Rate this Story)
Loading ... Loading ...

Post Your Comment

 
Featured Recommended
 
Specials
 
Movies Actress Actor Events