Chiru should join into politics:Suman
Sunday, February 17th, 2008 at 12:00 am

ఈరోజు సినీహీరో సుమన్ విశాఖపట్నంలోని ఓకార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి ఆశయాలు బాగున్నాయని, ఆయన స్థాపించబోయే పార్టీ కూడా తనకు బాగా నచ్చిందని, ఆయన సినిమాల్లో నటించడమేకాకుండా అనేక సామాజిక సేవాకార్యక్రమాలు కూడా చేస్తున్నారని అన్నారు. ప్రస్తుత పరిస్తితులలో చిరంజీవి రాజకీయాలలోకి రావలసిన అవసరం ఎంతైన ఉందని, చిరంజీవి పార్టీ సిధ్ధాంతాలు, ఆశయాలు తనకు నచ్చాయి కాబట్టి, ఆపార్టీకి ఓటు వేసే మొదటివ్యక్తిని తానేనని, చిరంజీవికి పార్టీ నడిపే సత్తా ఉందని నొక్కి వక్కాణించారు. అయితే ఇటీవల తెలుగు హీరో సుమన్ ప్రేక్షకులను మెప్పించే చిత్రాలలో నటించలేకపోయారు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూవచ్చిన సుమన్, ఇప్పుడు చిరంజీవి పార్టీ పెడతాడంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో, చిత్రపరిశ్రమ నుంచి మొదటిసారిగా సుమన్ ఆపార్టీలో చేరతానని బహిరంగంగా చెప్పారు.
 
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5 out of 5)
Loading ... Loading ...

Post Your Comment

 
Featured Most Popular
 

Should Chiranjeevi start Criticizing and Respond strongly to any personal attacks on him ?


Loading ... Loading ...
 
Movies Actress Actor Events