I will join chiru in politics:V V Vinayak
Sunday, March 2nd, 2008 at 12:56 am

ప్రముఖ తెలుగు సినీదర్శకుడు వి.వి.వినాయక్ శనివారం (మార్చి 1) తూర్పు గోదావరి జిల్లా తునిలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చిరంజీవి కనుక రాజకీయ పార్టీ పెడితే అందులో తాను చేరి ప్రజాసేవా కార్యక్రమాలు చేపడతానని అన్నారు. దర్శకునిగా ఎన్నో హిట్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించిన వి.వి.వినాయక్ 2002లో "ఆది" సినిమా మొదలుకొని ఈ సంవత్సరం "కృష్ణ" సినిమా వరకు అన్ని సినిమాలు, ఫాక్షన్, రాజకీయ నేపథ్యంలోనివే తీసారు. 2003లో వి.వి.వినాయక్ దర్శకత్వం వహించి, చిరంజీవి నటించిన "ఠాగూర్" సినిమా అత్యధిక కలెక్షన్లతో అశేష ప్రేక్షకాదరణ పొందిన విషయం పాఠకులకు విదితమే.


(3 votes, average: 4.67 out of 5)

























