మెగా పార్టీ గురించి మేడమ్ ఆరా!
Friday, February 1st, 2008 at 7:46 am

మెగాస్టార్ చిరంజీవి ఇంకా ప్రకటించని పార్టీ అని రాజకీయ శిబిరాల్లోనూ గుబులు పుట్టిస్తోంది. చిరంజీవి పెట్టబోయే ఈ పార్టీ వల్ల తమకు ఎంతమేరకు నష్టం వాటిల్లుతుంది అనే అంశం రాజకీయనాయకులను ఎక్కువగా కలవరపరుస్తోంది. రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా చిరు పార్టీ ప్రకంపనలు
పుట్టిస్తోంది. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి, మేడమ్ సోనియాగాంధీ రాష్ట్రంలో చిరంజీవి పెట్టబోయే పార్టీ గురించి ఆరా తీశారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర నేత పాల్వాయి గోవర్ధనరెడ్డి స్వయంగా చెప్పారు. గురువారం డిల్లీలో సోనియాగాంధీని కలిసిన పాల్వాయి తమ చర్చల్లో చిరంజీవి పార్టీ గురించి ప్రస్తావన వచ్చిందని చెప్పారు. ‘ఒకవేళ చిరంజీవి పార్టీ పెడితే మన కాంగ్రెస్ కు నష్టం ఉంటుందా?’ అని సోనియా గాంధీ అడిగారని పాల్వాయి చెప్పారు. చిరంజీవి పెట్టబోయే పార్టీ కోస్తా ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుందని, దానివల్ల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కూడా నష్టపోతాయని తాను వివరించినట్టు పాల్వాయి అన్నారు. మరొక వైపు చిరంజీవి పార్టీకి బి.సి.లు వెన్ను దన్నుగా ఉంటారని భావిస్తున్న నేపధ్యంలో ఆ వర్గాలని ఆకట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ కూడా తనదైన శైలిలో ప్రయత్నాలు ప్రారంభించింది.