Don’t be over enthusiastic:Nagababu
Wednesday, February 6th, 2008 at 12:00 am
చిరంజీవి పార్టీ పెడుతున్నట్లు మీడియాలో వచ్చిన ఊహాగానాల వార్తలకు చిరంజీవి తమ్ముడు నాగబాబు ప్రతిస్పందించారు. దీనిపై అన్ని మీడియా సంస్థలకు తనపేర చిరంజీవి ఇంటినుంచి ఫేక్స్‌మెసేజ్ పంపించారు. చిరంజీవి పార్టీపై అధికారికంగా ప్రకటిస్తారని, అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని, అన్నయ్య చేసేప్రకటనే అధికారిక ప్రకటన అవుతుందని చెప్పారు. కొద్దిమంది మీడియా ప్రతినిధులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, అది వాస్తవం కాదని, చిరు పార్టీ పెట్టడంపై ఇంకా ఏవిధమైన నిర్ణయం తీసుకోలేదన్నారు.



























