చిరంజీవి మాట్లాడాకా చూద్దాం
Thursday, January 31st, 2008 at 3:55 pm
కాంగ్రెస్‌లో చిరంజీవి టాపిక్ కలకలం సృష్టిస్తూ చివరకు సోనియా కూడా చిరు పార్టీపై ఆరాలు అడిగే వరకు వెళ్ళింది. మరి చిరంజీవి పార్టీ పెడితే ఎంతో కొంత నష్టపోయే తెలుగుదేశం మాటేమిటి? ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి ఏమనుకుంటున్నారు? ఏరువాకలో ఇదే ప్రశ్న ఆయనకు సంధిస్తే "ముందు చిరంజీవి మాట్లాడనివ్వండి. ఆయన ఇంత వరకు తన ఆలోచన ఏమిటన్నది ప్రకటించలేదు. ఆయనే మాట్లాడకుండా ముందు నేనెలా వ్యాఖ్యానిస్తాను" అని బదులిచ్చారు. చంద్రబాబు పైకి బింకం ప్రదర్శించినా కానీ చిరంజీవి ని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం అప్పుడే వ్యూహ రచన చేసిందన్నది స్పష్టం. చిరంజీవి పార్టీకి అండగా నిలుస్తారు అని విశ్లేషకులు అంచనా వేస్తున్న బీసీలకు చంద్రబాబు ముందే రిజర్వేషన్ మంత్రం వేసేసారు కదా?




























