Chiru should enter into politics: Vijaykanth
Tuesday, March 11th, 2008 at 2:43 pm

చిరంజీవి రాజకీయాలలోకి వస్తే సినిమాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా రికార్డులు బ్రేక్ చేస్తారని తమిళ హీరో విజయ్‌కాంత్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి రాజకీయాలలోకి రావాలనీ, రాజకీయాలలో పేరుకుపోయిన అవినీతి దుమ్ము దులపాలనీ అన్నారు. చిరు రాజకీయాలలోకి వస్తే ఆంద్రప్రదేశ్‌కు మంచి జరుగుతుందనీ అన్నారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, వారి మన్నలను పొందుతున్న ఆయన రాజకీయాలలోకి వచ్చి ప్రజలకు సేవచేయడం అవసరం అనీ, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో చిరు విజయ వంతం అవుతారనీ విజయకాంత్ చెప్పారు.


(6 votes, average: 4.33 out of 5)
























