Chiru prachara ratham to come to Hyderabad shortly
Monday, June 16th, 2008 at 4:19 pm

చాలా కాలం క్రితమే చిరంజీవి ప్రచార రథం తయారవుతున్నదనే వార్తను తొలిగా చిత్రమాల అందించింది. ఇప్పుడు దానికి సమబంధించిన మరింత తాజా సమాచారాన్ని చిత్రమాల సేకరించింది. ఇటీవల ఉప ఎన్నికలకు ముందు ప్రచారానికి టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఉపయోగించిన వాహనం తరహాలోనే ఈ ప్రచార రథం రూపొందుతోంది. అహ్మదాబాద్‌లోని ఒక బస్ బాడీ బిల్డింగ్ యూనిట్‌లో ఇది తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇది 10 టైర్లు వుండే ’లాంగ్ చాసీ’ (ప్రత్యేకమైన బస్సు). ముంబైకి చెందిన పేరుపొందిన ఆటోమొబైల్ డిజైనర్ మనీష్ ఈ వాహనానికి రూపకల్పన చేశాడు. ఆయన ఆరు రకాల డిజైన్లను తయారు చేయగా, వాటిలో చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డిజైన్ ప్రకారం ఈ వాహనం తయారవుతోంది. ఈ ప్రచార రథంలో సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పది మంది కూర్చుని సమావేశమయ్యేందుకు వీలయ్యే ఒక కాన్ఫరెన్స్ హాలు, ప్రత్యేక విశ్రాంతి గది, డైనింగ్ హాలు, టాయిలెట్ రూమ్ ఇందులో వుంటాయి. సాధారణంగా సినిమా షూటింగులలో వుపయోగించే ఆధునిక లైటింగ్ సౌకర్యాన్ని ఇందులో ఏర్పాటు చేశారు. శక్తివంతమైన సౌండ్ సిస్టమ్‌ను అమర్చారు. సినిమాలు చూసేందుకని ఒక పెద్ద మానిటర్‌ను అమర్చారు. టీవీ చానళ్లు లైవ్ ప్రోగ్రామ్స్ కోసం వుపయోగించే ఓబీ వ్యాన్ తరహాలో ఇందులో ఔట్‌డోర్ బ్రాడ్‌కాస్టింగ్ ఎక్విప్‌మెంట్‌ను సమకూరుస్తుండటం విశేషం. ఇది పని వేయడం కోసం వాహనం కింది భాగంలో సౌండ్ ప్రూఫ్ జనరేటర్‌ను అమర్చారు. ఈ ఎక్విప్‌మెంట్‌ను శాటిలైట్‌కు అనుసంధిస్తారు. దీన్ని ఓబీ వ్యాన్ రూపకర్త రామన్‌జీ (ఢిల్లీ) డిజైన్ చేశారు. ఆగస్టులో రాజకీయ పార్టీ ప్రకటన తర్వాత చిరంజీవి మూడు నెలలపాటు ఈ వాహనంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తారు. ఈ ప్రచారాన్ని కవర్ చేయడానికి అన్ని టీవీ చానళ్లు కష్టపడనవసరం లేకుండా ఇందులోని బ్రాడ్‌కాస్టింగ్ ఎక్విప్‌మెంట్‌తో నేరుగా ఆయా టీవీ చానళ్లకు ప్రసారాల్ని అందిస్తారు. దాదాపు నిర్మాణం పూర్తికావచ్చిన ఈ ప్రచార రథం మరో వారం, పది రోజుల్లో అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు చేరనున్నట్లు చిత్రమాలకు విశ్వసనీయ సమాచారం అందింది.


(7 votes, average: 4.29 out of 5)


























June 16th, 2008 at 4:30 pm
thanks to chitramala..very fast coveraging news…best of luck chiruji..
June 16th, 2008 at 5:20 pm
what a wonderful reporting! asalu meeru ee samacharanni ela trace chestunnarandee babu… nenu anukuntunnanu chitramala chiranjeevi bandhuvuladani. lekunte evarikee teliyani, trace cheyadaniki kuda possibility leni secrate news ni intha fastga ela andistunnaru? media rangamlo chiru ki sambandhinchi cover chestunna vaarthallo meere top. anduku meeku maa thanks.
June 16th, 2008 at 5:22 pm
GOOD LUCK TO ENTIRE THE TEAM OF CHITRAMALA.COM——GREAT FAN OF YOU , DEEPAK
June 16th, 2008 at 8:08 pm
kevvu keka…thanks 2 chitramala
June 17th, 2008 at 12:17 pm
Let us pray god to make “ANNAYYA” a “GOOD LEADER” for our state.Thanks for CHITRAMALA.
June 17th, 2008 at 1:17 pm
hot news isthunnaru.thanks
June 17th, 2008 at 1:20 pm
thanks to u .very hot coverage
June 17th, 2008 at 5:30 pm
I am very happy heared very very hot news