చిరు అభిమాని ఆత్మహత్య
Sunday, February 3rd, 2008 at 12:00 am

చిరు అభిమాని పార్ధసారథి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ మనస్తాపానికి గురై ఉరి వేసుకొని చనిపోయినాడు. ఖమ్మం జిల్లా, మనుగూరు మండలం, తోగూడెం   గ్రామానికి చెందిన పార్ధసారథి హోంగార్డ్‌గా భద్రాచలంలో పోలీస్ స్టేషన్‌లో  పనిచేస్తున్నాడు. ఆయన వ్రాసిన సూసైడ్ నోట్‌లో సినీహీరో రాజశేఖర్‌కు చిరు క్షమాపణ అడగటంపై మనస్తాపం చెందానని, చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలనివుంది కాని ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోలేనందున ఆత్మహత్యకు పాల్పడినట్లువుంది. చిరు  రాజకీయాల్లోకి రావడానికి కాలం సహకరించడంలేదని సూసైడ్ నోట్‌లో వ్రాసివుంది మరియు నా మరణానంతరం నా కళ్ళను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు దానం చేయాలని మరియు పార్ధసారథి అంత్య క్రియలకు చిరంజీవి హాజరుకావాలని కోరాడు. చిరంజీవి సోదరుడు నాగబాబు మీడియాతో మాట్లాడుతూ అభిమాని ఆత్మహత్య ఉదంతం విని తీవ్రదిగ్బ్రాంతికి గురిచెందానని, చనిపోయినవ్యక్తి నిజంగా చిరు అభిమాని ఐతే అతని కుటుంబాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆదుకుంటుందని, అభిమానులు సంయమనం పాటించాలని కోరారు. 
 
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 1 out of 5)
Loading ... Loading ...

Post Your Comment

 
Featured Most Popular
 

Who has the best Style ?


Loading ... Loading ...
 
Movies Actress Actor Events