‘చిరుత’ శతదినోత్సవ వేడుకలో దాసరి
Friday, February 1st, 2008 at 6:05 pm

మెగాస్టార్ చిరంజీవి వారసుడు మెగా పవర్‌స్టార్ హీరోగా ఇంటర్‌డ్యూస్ చేస్తూ డాషిగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ సి.అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బానర్‌పై నిర్మించిన చిత్రం ‘చిరుత’. ఓపెనింగ్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టించి, కలక్షన్‌లలో తండ్రిని మించిన తనయుడిగా నిలిచారు. 40 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని కలెక్షన్స్‌లో సూపర్‌డూపర్ హిట్ చిత్రంగా నిలబడ్డ వైజయంతి మూవీస్ ‘చిరుత’ శత దినోత్సవం జనవరి 30న హైదరాబాద్ శిల్ప కళా వేదికలోని మౌంటైన్ హైట్స్‌లో వైభవంగా జరిగింది.కేందమంత్రివర్యులు,దర్శక రత్న, డా.దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో చిరంజీవి, విక్టరీ వెంకటేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్‌స్టార్ అల్లూ అర్జున్, క్రేజి స్టార్ రవితేజ, శ్రీకాంత్, రాజమౌళి, దర్శకుడు బి.గోపాల్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, డి.రామానాయుడు, నిర్మాత జి.ఆధిశేషగిరిరావు వీరితో పాటూ ప్రముఖులు అనేకమంది విచ్చేశారు. ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ ‘ఎవరికైనా మొదటి చిత్రం శతదినోత్సవం జరుపుకోవడం ఒక గొప్ప అనుభూతి. ఇవాళ్ల ‘చిరుత’ 100 రోజుల వేడుక అన్నింటికంటే మించిన పెద్ద పండుగ.తొలి చిత్రంతోనే తన టాలెంట్ నిరూపించుకున్నాడు చరణ్. నీ కష్టానికి నాన్న ఇమేజ్ తోడై మంచి సక్సస్ ఇచ్చింది. రెండో చిత్రంలో మాత్రం నీకు నువ్వుగా ఫ్రూప్ చేసుకోవాలి. నీకు ఆసత్తా ఉందని’ ఆయన అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘కాలేజీ చదివే రోజుల్లో చిరంజీవిగారి సినిమాలు పిచ్చిగా చూసేవాడిని. అలాంటిది నేను డైరెక్టరై చిరంజీవిగారి అబ్బాయి హీరోగా నటించిన తొలిచిత్రానికి దర్శకత్వం వహించడం చాలా థ్రిల్‌గా ఉందని’ అన్నారు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ మాట్లాడుతూ ‘నాజీవితంలో మెమొరబుల్ డే ఇది. ‘చిరుత’ సక్సస్స్ చాలా బాగా ఎంజోయ్ చేశాను. అశ్వనీదత్‌గారు, పూరి జగన్నాథ్‌గారు చాలా కేర్ తీసుకుని ఈ ప్రాజక్టును చేశారు. కనుకనే ఈ చిత్రం ఇంత మంచి హిట్‌ను ఇచ్చింది’ అని అన్నారు.


(5 votes, average: 4.6 out of 5)

























