పెళ్ళి ఆరోపణలను ఖండించిన రామ్‌చరణ్‌తేజ
Friday, February 1st, 2008 at 12:00 am
చిరంజీవి తనయుడు, చిరుత హీరో రామ్‌చరణ్‌తేజ, చిరుత హీరోయిన్ నేహాశర్మను గోవాలో ప్రేమపెళ్ళి చేసుకున్నాడని వచ్చిన పుకార్లకు అతను స్పందించి ఈరోజు సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ నా పెళ్ళిపై వస్తున్న పుకార్లు విని నాకు నవ్వొస్తుందని అన్నారు. నా పెళ్ళికి చాలా టైముందని, నేను అందరికీ చెప్పి పెళ్ళి చేసుకుంటానని, నేనింకా సినీపరిశ్రమలో నిలదొక్కు కోవాలని, అప్పుడే నాపెళ్ళికేమి తొందరొచ్చిందని మీడియాతో చెప్పారు. మీ ప్రేమ గురించి చెప్పమని అడుగగా నాకైతే ఏమీ తెలవదు అన్నారు. మీ పై ఆరోపణలు వస్తున్నాయని అడిగిన ప్రశ్నకు సమాధానంగా మీరే పరిశోధించి చెప్పాలని అన్నారు. ఆయనపై వచ్చిన పెళ్ళి ఆరోపణలను ఖండించారు.




























