Difficulty to ‘Rising Sun’ for Chiru party
Thursday, March 13th, 2008 at 12:00 am
ఉగాది రోజు.. అంటే ఏప్రిల్ 7న పార్టీని ప్రకటించేందుకు చిరంజీవి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పార్టీ ఎన్నికల చిహ్నం విషయంలోనే ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ‘ఉదయించే సూర్యుడు’ కావాలని చిరంజీవి భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ చిహ్నం గురించి ఎన్నికల కమీషన్‌లో వాకబు చేసేందుకే చిరు తమ్ముడు నాగబాబు, ఆయన బావమరిది అల్లు అరవింద్ ఇటీవల ఢిల్లీకి వెళ్లారు. తమిళనాట డిఎంకె పార్టీ చిహ్నం ఉదయించే సూర్యుడే. అది ప్రాంతీయ పార్టీ కాబట్టి మరో రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీకి ఆ చిహ్నం కేటాయించడంలో ఎన్నికల కమీషన్‌కు ఎలాంటి అభ్యంతరం వుండదు. అయితే డిఎంకె పార్టీకి మన రాష్ట్రంలోనూ యూనిట్లు వుంటే మాత్రం అప్పుడు ఆ చిహ్నం మరో పార్టీకి కేటాయించడంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. చిరు పార్టీ ప్రకటనకు సమయం దగ్గరపడుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆ పార్టీ చిహ్నం మీదే వుంది.




























