Fans wants Chiru to enter in politics
Thursday, February 21st, 2008 at 5:08 pm
చిరంజీవి రాజకీయాలలోకి రావాలంటూ ఈ రోజు చిరంజీవి అభిమానులు గుంటూరు, ఒంగోలులో భారీ ర్యాలీలు నిర్వహించారు. చిరు రాజకీయ రంగప్రవేశం చేయాలని వీరు భారీగా వివిధ జిల్లాలలో తమదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరు, ఒంగోలులో చిరు అభిమానులు మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అదే విధంగా భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ చిరు రాజకీయ రంగప్రవేశం చేసి సమాజంలో పేరుకుపోయిన అవనీతి అక్రమాలను నేలరాల్చాలని, ఇలా చేయడం ఒక్క చిరంజీవికే సాధ్యమని, అందుకే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయాలని అన్నారు. చిత్తూరులో అభిమానులయితే ఒక అడుగు ముందుకు వేసి ఒక రోజు నిరాహార దీక్ష మొదలు పెట్టారు. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని వారు హెచ్చరించారు. ఏదేమైనా చిరు రాజకీయాలలోకి రావాలన్నదే వారి కోరిక.
 
          
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (Please Rate this Story)
Loading ... Loading ...

Post Your Comment

 
Featured Recommended
 
Specials
 
Movies Actress Actor Events