Hariramajogaiah hastens to join into Chiru party
Saturday, June 14th, 2008 at 7:45 pm
రానున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించి కలకలం రేపారు నర్సాపురం లోక్‌సభ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చేగొండి హారిరామజోగయ్య. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో నిలబడనని కూడా ఆయన తెలిపారు. ఇప్పుడు చిరంజీవి పెట్టనున్న పార్టీలో చేరేందుకు తహతహ లాడుతున్నారు. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశ ఊహాగానాలు మొదలైనప్పట్నించీ ఆయన మీద వరుసగా ప్రత్యేక కథనాలు ప్రచురిస్తూ వస్తున్న సూర్య దినపత్రిక అధినేత నూకారపు సూర్యప్రకాశరావుతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. ఆయన ద్వారా చిరంజీవికి దగ్గర కావడానికి యత్నిస్తున్నారు. చిరంజీవికి అనుకూలంగా, వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా ప్రకటనలిస్తూ వస్తున్న ఆయన చిరంజీవి నుంచి పిలుపు వస్తుందని ఆయాన ఆశించారు. అలాంటిదేమీ రాకపోవడంతో ఇప్పుడు తానే చిరంజీవికి సన్నిహితమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. సీనియర్ కాబట్టి చిరు పార్టీలో తనకు సముచిత స్థానం లభిస్తుందనేది ఆయన ఆశ. అయితే ఇప్పటికే చిరంజీవి చుట్టూ ఒక కోటరీ ఏర్పడినందున ఆయన ఆశ నెరవేరడం కష్టంగా కనిపిస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నూకారపు సైతం చిరంజీవి పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం చిత్రమాలకు అందింది.
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (5 votes, average: 3.8 out of 5)
Loading ... Loading ...

3 Responses to “Hariramajogaiah hastens to join into Chiru party”

  1. deepak Says:

    megastar gurinchi special news istunnaru. websites annintilonu meere super fast ga vunnaru.daily paper kanna mundu meere taja news istunnaru.very good.keep it up and congrates to your crue.

  2. kata Says:

    very good.latest news.keep it up

  3. chintu Says:

    waste fellow.. why he wants to establish a party? blood sucker…………………

Post Your Comment

 
Featured Most Popular
 

Should Mahesh campaign for Congress ?


Loading ... Loading ...
 
Movies Actress Actor Events