High Court notice to Chiranjeevi
Monday, March 10th, 2008 at 5:18 pm

తమ్ముడు పవన్ కల్యాణ్ మరోసారి అన్న చిరంజీవికి చిక్కులు తీసుకొచ్చాడు. పవన్ భార్య నందిని పెట్టిన బహు భార్యత్వం కేసుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు సోమవారం చిరంజీవి సహా 11 మందికి నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లోగా జవాబివ్వాలని ఆదేశించింది. తనకు విడాకులివ్వకుండానే రేణూ దేశాయ్‌ని తన భర్త పవన్ కల్యాణ్ రెండో వివాహం చేసుకున్నాడంటూ నందిని దాఖలు చేసిన కేసును ఇటీవల విశాఖ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. పవన్ రెండో పెళ్లి చేసుకున్నాడనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పిన కోర్టు, రేణుతో తాను కేవలం సహజీవనం మాత్రమే చేస్తున్నానని పవన్ చెప్పిన మాటల్ని విశ్వసించింది. దానిపై నందిని హైకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్‌ను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం దానిని విచారణకు స్వీకరించింది. చిరంజీవి, అల్లు అరవింద్ సహా 11 మందికి నోటీసులు పంపింది. ఇద్దరు ఆడా మగా వివాహం చేసుకోకుండా సహజీవనం సాగించినా దాన్ని భార్యాభర్తల సంబంధం గానే పరిగణించాలని ఒకటి రెండు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఆధారం చేసుకుని నందిని హైకోర్టుకు అప్పీల్ చేసినట్లు తెలుస్తోంది. అయినా భార్య వుండగా మరో స్త్రీతో సహజీవనం చేయడం సక్రమమేనా అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్ధకమవుతోంది.






























