Labour Party is name of Chiru party
Saturday, May 31st, 2008 at 2:40 pm
చిరంజీవి పార్టీకి ’లేబర్ పార్టీ’ అన్న పేరు ఖాయమైంది. ఈ సంగతిని చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ ధృవీకరించారు. ’ట్రైన్’ (రైలు బండి)ను పార్టీ చిహ్నంగా ఎంపిక చేశారు. శనివారం పలు కార్మిక సంఘాల ప్రతినిథులతో గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అరవింద్ సమావేశమయ్యారు. కార్మిక సంఘాలు ఇప్పటికే చిరంజీవి పార్టీకి తమ మద్దతును ప్రకటించాయి. ఈ సమావేశం సందర్భంగా అరవింద్ ఎన్‌టీవీతో మాట్లాడారు. "ఇంతదాకా ఐదారు పేర్లను అనుకుంటూ వస్తున్నాం. ఈరోజు లేబర్ పార్టీ అన్న పేరును ఖాయం చేశాం. చిరంజీవి గారికి కార్మికులంటే చాలా ఇష్టం, గౌరవం. అందుకే ’లేబర్ పార్టీ’ పేరును ఖాయం చేశారు. ఆగస్ట్ 15న చిరంజీవి గారు పార్టీని అధికారికంగా ప్రకటిస్తారు. వామపక్షాలు, లోక్‌సత్తాతో చిరంజీవి పార్టీ పొత్తు పెట్టుకుంటుంది. సమ సమాజ న్యాయం లేబర్ పార్టీ ఎజండాగా వుండబోతోంది. ఉచిత విద్య, వైద్యం అందించాలని కూడా ఎజండాలో వుంటుంది. నేర చరిత్ర కలిగిన వారికి పార్టీలో చోటు వుండదు. పజల కోరికను చిరంజీవి మన్నిస్తారు" అని అరవింద్ తెలిపారు. కాగా అంతకుముందు చిరంజీవి రాజకీయాల్లోకి రావాలంటూ పలు కార్మిక సంఘాల ప్రతినిథులు ట్యాంక్ బండ్ నుంచి గీతా ఆర్ట్స్ కార్యాలయం దాకా ర్యాలీ చేపట్టారు. అరవింద్ ప్రకటనతో చిరంజీవి పార్టీ పేరు ఏమిటనే దానికి తెరపడినట్లేనని భావించలేం. చిరంజీవి పార్టీని అధికరికంగా ప్రకటించేలోగా ఏ మార్పులైనా జరుగవచ్చు. ఇప్పటిదాకా పార్టీ పేరు, గుర్తులపై అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే చిరంజీవి పార్టీకి ’లేబర్ పార్టీ’ పేరు పరిశీలనలో వున్నదనే సంగతిని రెండు నెలల క్రితమే తొలిసారిగా చిత్రమాల వెల్లడించిన సంగతి గమనార్హం. 
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (6 votes, average: 4.33 out of 5)
Loading ... Loading ...

4 Responses to “Labour Party is name of Chiru party”

  1. rohith Says:

    As mega star chiru is coming into politices being his fans iam very happy but choosing the right name for the party is very important but the name labour party doesn’t match for the party and better try any other name

  2. himam saheb Says:

    Chiru is coming into politices good news for his fans, but how exactly his party settle is important. And choose the correct leaders also. The party name “labor Party” is good, but it shows only labors. other people think that like rich persons this for labors, not for us.

    any way I wish to chiru All the best

  3. 9849794764 Says:

    very happy news..

  4. N.Mohan Says:

    i’m very happy ANNAIYA,but selecting the best leaders for currest ruling.
    Definetly u will be CM.

Post Your Comment

 
Featured Most Popular
 

Should Mahesh campaign for Congress ?


Loading ... Loading ...
 
Movies Actress Actor Events