Pavan Kalyan to conduct Lakshyam
Thursday, June 19th, 2008 at 4:34 pm

త్వరలో ‘పులి’గా నటించేందుకు సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్ త్వరలో ‘లక్ష్యం’ను చేపట్టనున్నారు. అంటే ‘లక్ష్యం’ అనేది సినిమా పేరేమీ కాదు. ఒక సదస్సు. ఇంతవరకు తనంతట తానుగా ఎన్నడూ మీడియా ముందుకు రాని పవన్ త్వరలో మీడియాను కలవబోతున్నారు. ఈ నెలలో ఆయన హైదరాబాదులో చిరంజీవి యువత ప్రతినిథులతో ‘లక్ష్యం’ అనే సదస్సును నిర్వహించబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 200 అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి దాదాపు 3000 మంది చిరంజీవి యువత ప్రతినిథులు ఇందులో పాల్గొంటారు. చిరంజీవి పార్టీ ప్రకటన చేసిన అనంతరం పార్టీలోని యువత ఎలా వుండాలి, ఎలా నడచుకోవాలి, పార్టీని సామాన్య ప్రజలకు ఎలా చేరువ చేయాలి, పార్టీ లక్ష్యాల సాధన కోసం ఎలా కృషి చేయాలి.. అనే అంశాలపై ఈ సదస్సులో వారికి వివరించనున్నారు. ఇందులో నాగబాబు, డాక్టర్ మిత్రా, డాక్టర్ బ్రహ్మానందం, టీవీ రావు వంటివాళ్లు ప్రసంగిస్తారని చిత్రమాలకు సమాచారం అందింది. ‘లక్ష్యం’ సదస్సు జరిగే తేదీ మాత్రం తెలియరాలేదు. సో.. చిరంజీవి పార్టీకి సంబంధించి పవన్ కల్యాణ్ ఎలా క్రియాశీలంగా వ్యవహరిస్తున్నదీ దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.



(14 votes, average: 3.79 out of 5)


























June 19th, 2008 at 5:45 pm
excellent coverage.thanks boss..
June 19th, 2008 at 5:47 pm
powerstar zindabad.thank you chitramala.
June 19th, 2008 at 6:12 pm
thanks
June 20th, 2008 at 1:22 pm
pavan ki antha scene ledhu babu…………..
June 27th, 2008 at 9:36 am
wish all the best Mr.Pavan Kalayan and pavan jindhabad…………………………………….
July 18th, 2008 at 1:27 pm
U be supporter to ur brother. But wont directly participate in elections.
And defenately Chiru is our next CM.