Preparations for Chiranjeevi Party’s office
Wednesday, April 23rd, 2008 at 6:22 pm

చిరంజీవి పార్టీ రావడం తథ్యమని ఆయన సన్నిహితుడు డాక్టర్ మిత్రా స్పష్టం చేయడంతో ఊహాగానాలకు ఒక రూపం వచ్చింది. ఉప ఎన్నికల తర్వాత ఏ నిమిషంలోనైనా చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం జరిగి, పార్టీ ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. కాగా చిత్రమాలకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆ పార్టీ కార్యాలయ భవన నిర్మాణం కోసం సన్నాహాలు కూడా మొదలయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవికి చెందిన ఖాళీ ప్రదేశంలో పార్టీ ఆఫీసు బిల్డింగును నిర్మించాలని చిరంజీవి సంకల్పించారు. ఆ స్థలం ప్రస్తుతం అల్లు అరవింద్‌కు చెందిన చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కార్యాలయ భవనం వెనుకనే వుంది. అక్కడ భవన నిర్మాణం కోసం ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు దరఖాస్తు కూడా వెళ్లింది. ఎన్ని అంతస్తులకు అనుమతి లభిస్తుందో చూసుకుని దాన్నిబట్టి ప్లాన్ వేయించి, అప్పుడు భవన నిర్మాణాన్ని ప్రారంభిస్తారని తెలియవచ్చింది. సో.. చిరు పార్టీ రాదేమోననే అనుమానాలకు ఇక తావు లేనట్లే.



(7 votes, average: 3.71 out of 5)

























