Telangana may decide chiru party arrival?
Wednesday, February 6th, 2008 at 12:00 am

వచ్చే ఉగాదికి చిరంజీవి పార్టీ ప్రకటన ఖాయమనే వార్తలు వస్తుండగా, మరోవైపు ఆ పార్టీ రాక తెలంగాణ అంశంపై ముడిపడి ఉన్నదనే వాదన ఒకటి బయటికి వచ్చింది. అదేమంటే.. ఈలోగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వెలువడితే చిరంజీవి పార్టీ రాదని. అలా అని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుడు వి. ప్రకాశ్ చెబుతున్నారు. ఆయన వాదన ప్రకారం తెలంగాణ రాకపోతేనే చిరంజీవి పార్టీ పెడతారు. తెలంగాణ వస్తే ఆయన పార్టీకి బలం తగ్గుతుంది. రాయలసీమ కాంగ్రెస్‌కి బలమైన ప్రాంతం కాబట్టి అక్కడ చిరంజీవి పార్టీ గెలిచే అవకాశాలు తక్కువ. అలాగే ఆంధ్ర ప్రాంతంలోనూ రాజకీయ చైతన్యం ఎక్కువ కాబట్టి అక్కడ కూడా ఆయన గట్టి పోటీ ఎదుర్కొంటారు. అందువల్ల తెలంగాణ అంశం మీదే ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి వుందని ప్రకాశ్ అంటున్నారు. ఇది అంత తేలిగ్గా కొట్టివేయదగ్గ అంశం కాదు. మరి చిరంజీవి ఈ లెక్కలు వేసుకుంటున్నారో, లేదో? 
 
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (Please Rate this Story)
Loading ... Loading ...

Post Your Comment

 
Featured Most Popular
 

Who would be your choice to pair with Mahesh babu ?


Loading ... Loading ...
 
Movies Actress Actor Events