Bujjigadu
Cast :  Prabhas,Trisha,Mohan Babu
Director :  Puri Jagannath
Producer :  K.S.Rama Rao
 | Review  | Trailers  | Videos  | Audio  |  Wallpapers  | Photogallery  | Muhurtham- Photogallery  | Working Stills- Photogallery  | Audio Launch- Photogallery  | Audio Platinum Disc- Photogallery  | Premiere- Photogallery |
హీరో ఎవరైనా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమా అంటే చాలు.. ఆ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చేస్తుంది. అంతగా పాపులర్ అయిన అతనిప్పుడు యువ హీరో ప్రభాస్‌ని 'బుజ్జిగాడు.. మేడిన్ చెన్నై'గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. 'పోకిరి', 'దేశముదురు', 'చిరుత' సినిమాల తర్వాత అతను డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ప్రభాస్ సరసన త్రిష ప్రధాన నాయిక కాగా, సంజన అనే ముంబై అమ్మాయి రెండవ హీరోయిన్ పాత్రలో తెలుగు తెరకు పరిచయమవుతోంది. ప్రభాస్, త్రిష కలిసి నటించడం ఇది మూడవసారి. ఇదివరకు ఆ ఇద్దరూ 'వర్షం', 'పౌర్ణమి'లలో జంటగా నటించారు. 'బుజ్జిగాడు'లోని ప్రధాన విశేషం త్రిష అన్న పాత్రలో విలక్షణ నటుడు మోహన్‌బాబు కనిపించనుండడం. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కెఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమా మే 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ట్యాగ్‌లైన్‌కు తగ్గట్లే ఈ సినిమాలో ప్రభాస్ తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ వీరాభిమానిగా కనిపిస్తాడు. సినిమాలో అతనిపేరు బుజ్జి. రజనీకాంత్ సినిమా విడుదలయ్యిందంటే ఎంత కష్టమైనా మొదటి రోజు మొదటి ఆట చూసి తీరాల్సిందే. అలాంటి అతనితో ఒకసారి సినిమా థియేటర్ వద్ద చిట్టి (త్రిష) అనే అందమైన అమ్మయి గొడవ పడుతుంది. చాలా సినిమాల్లో మాదిరిగానే వారి పరిచయం ప్రణయంగా మారుతుంది. చిట్టి స్థానిక గూండా శివన్న (మోహన్‌బాబు) చెల్లెలు. కథ ప్రధానంగా ఈ మూడు పాత్రల మధ్యే నడుస్తుంది. బుజ్జి పాత్రలో రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. సంఘ వ్యతిరేక శక్తులతో పోరాడే తెగువ వుండే అతడు తెలివైనవాడు. రొమాంటిక్ కూడా. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలాంటి భయం లేకుడా ఎదుర్కొనే అతను చిట్టిని ఎలా సొంతం చేసుకున్నాడనేది ఆసక్తికరం. "నిజ జీవితంలోనూ రజనీకాంత్‌కి అభిమానినైన నేను ఈ సినిమాలో ఆయన అభిమానిగా నటించడం సంతోషాన్ని కలిగించింది" అని తెలిపాడు ప్రభాస్.
రజనీకాంత్‌ని కీర్తిస్తూ సాగే పాటను కూడా ప్రభాస్ మీద చిత్రీకరించాడు జగన్. 'తలైవా వా వా' అంటూ సాగే ఆ పాటను భాస్కరభట్ల రవికుమార్ రాశాడు. ఆ పాటను మార్క్ లాజరో, అనైదా పాడారు. ఆ ఇద్దరికీ ఇది తొలి తెలుగు పాట. సందీప్ చౌతా సంగీత దర్శకుడు. 'సూపర్' తర్వాత జగన్, సందీప్ మళ్లీ ఈ సినిమాకి కలిశారు. సినిమాలోని ఆరు పాటల్లో తలో మూడింటిని కందికొండ, భాస్కరభట్ల రాశారు. కథ కంటే కథనానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకునే జగన్ ఈ సినిమాని కూడా స్క్రీన్‌ప్లే ప్రధానంగా తీర్చిదిద్దాడు.  ప్రకాష్‌రాజ్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాకు శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రాఫర్. కథ, మాటలు, స్క్రీన్‌ప్లేలను దర్శకుడు పూరీ జగన్నాథ్ సమకూర్చగా, విజయన్ ఫైట్ మాస్టర్‌గా, ఎంఆర్ వర్మ ఎడిటర్‌గా పనిచేశారు. 'ఛత్రపతి' తర్వాత మరో హిట్టులేని ప్రభాస్ 'బుజ్జిగాడు'గా ప్రేక్షకాదరణను పొందుతాననే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
 

Give your Rating Here :
Average Rating: 2.93    Votes: 79

 
Featured Recommended
 
 
Movies Actress Actor Events