
Gorintaku

| Cast : Rajashekar, Aarthi Agarwal, Meera Jasmine |
| Director : V.R. Prathap |
| Music Director : S.A. Rajkumar |
| Producer : N.V. Prasad, Paras Jain |
| Banner : Mega Super Good Films |
| Trailers
| Videos
| Audio
| Photogallery
| Working Stills- Photogallery
| Audio Launch- Photogallery
|
|
రాజశేఖర్ కథానాయకుడిగా మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ బానర్‌పై నిర్మాణమైన 'గోరింటాకు' సినిమా జూలై 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కన్నడ హిట్ ఫిల్మ్ 'అన్న తంగి' ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను ఆర్‌బి చౌదరి సమర్పించగా, ఎన్‌వి ప్రసాద్, పరస్ జైన్ నిర్మించారు. విఆర్ ప్రతాప్ దర్శకుడు. అన్నా చెల్లెళ్ల అనుబంధం ప్రధానంగా రూపొందిన 'గోరింటాకు'లో రాజశేఖర్, మీరా జాస్మిన్ అన్నాచెల్లెళ్లుగా నటించగా; రాజశేఖర్ సరసన నాయికగా ఆర్తీ అగర్వాల్ కనిపించనున్నది. మీరాకి జోడీగా ఆకాష్ నటించాడు. 2007 జూలై 5న ప్రారంభమైన ఈ సినిమా సరిగ్గా సంవత్సరం తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో సూపర్‌గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన సినిమాలన్నింటి కంటే ఎక్కువ సమయం తీసుకున్న సినిమా ఇదే. తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్టులో మార్పులు చేసి ఈ సినిమాను తీశామని దర్శకుడు ప్రతాప్ తెలిపాడు. అతను డైరెక్ట్ చేయగా ఘన విజయం సాధించిన 'నువ్వు వస్తావని'ని నిర్మించింది సూపర్‌గుడ్ సంస్థే. ఒరిజినల్ కంటే తెలుగు వెర్షన్ బాగా వచ్చిందని అతను చెప్పాడు. అతని అభిప్రాయం ప్రకారం 'అన్న', 'మా అన్నయ్య' సినిమాల కోవలో రాజశేఖర్‌కు 'గోరింటాకు' పేరు తీసుకు వస్తుంది. రాజశేఖర్ కూడా ఈ సంస్థలో ఇదివరకు 'సింహరాసి' వంటి హిట్ సినిమాను చేశాడు. పేరు తెచ్చిన 'ఎవడైతే నాకేంటి' తర్వాత ఆయన నటించిన సినిమా ఇదే. ఒకప్పుడు ఎన్టీఆర్, సావిత్రి అన్నాచెల్లెళ్లుగా నటించిన అజరామర చిత్రం 'రక్త సంబంధం'ను ఈ సినిమా జ్ఞప్తిచేస్తుందని సమర్పకులు ఆర్‌బి చౌదరి తెలిపారు. అన్నాచెల్లెళ్లుగా రాజశేఖర్, మీరా జాస్మిన్‌ల నటన సినిమాకు హైలైట్ అవుతుందనీ, ఆ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకుంటాయనీ ఆయన అన్నారు. ఈ సినిమా షూటింగ్ మహబూబ్‌నగర్‌లో జరిగినప్పుడు ఒక సంఘటన జరిగింది. యూనిట్ సభ్యులపై తేనెటీగలు దాడి చేశాయి. వాటి బాధితుల్లో మీరా కూడా వుంది. ఈ సినిమా సెట్స్ మీద వున్నప్పుడే నాయిక ఆర్తీ అగర్వాల్‌కు ఎన్నారై ఉజ్వల్ కుమార్‌తో పెళ్లయింది. బహుశా ఆమెకు ఇదే చివరి సినిమా కావచ్చు. వాస్తవానికి ఈ సినిమా తెలుగు హక్కుల్ని బళ్లారికి చెందిన ఎగ్జిబిటర్ లక్ష్మీకాంతరెడ్డి తీసుకున్నారు. ఆయన నుంచి ఆ హక్కుల్ని సూపర్‌గుడ్ సంస్థ పొందింది. రాజశేఖర్‌తో ఈ సినిమాను నిర్మించాలన్న ఆలోచన మాత్రం ఆర్‌బి చౌదరిది. ఇదివరకు సూపర్‌గుడ్ సంస్థ నిర్మించిన అనేక సినిమాలకు సంగీతాన్ని అందించిన ఎస్ఎ రాజ్‌కుమార్ ఈ సినిమాకూ బాణీల్ని అందించాడు. ఆ సంస్థలో ఇది ఆయనకు 25వ సినిమా కావడం గమనార్హం. సుజిత, చంద్రమోహన్, శివాజీ రాజా, హేమ, సూర్య, బ్రహ్మాజీ, పిజె శర్మ, రవిప్రకాష్, సురేఖావాణి తదితరులు తారాగణం. గంగోత్రి విశ్వనాథ్ సంభాషణలు రాయగా, అఖిలన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. |
| |||||||||
News | Box Office | Previews | Reviews | Trailers | Galleries | Wallpapers | Events | Videos | Audio Songs
| Web hosting by Ibee | ©2006 - 2008 Chitramala.com - Movies, Hollywood, Bollywood, Music, News, Photos, Videos - All rights reserved. |
| Music available on ChitraMala.com is for promotion of telugu music across the globe. | |


























