
Michael Madana Kamaraju

| Cast : Srikanth,Charmi,Prabhudeva,Sunil |
| Director : Nidhi Prasad |
| Music Director : Chakri |
| Producer : Raju, Praveen |
| Banner : Silver Screen Movies |
| Review
| Trailers
| Videos
| Audio
| Wallpapers
| Photogallery
| Audio Launch- Photogallery
| Press Meet- Photogallery
| Success Meet- Photogallery
| Working Stills- Photogallery
|
|
ఇదివరకు కమల హాసన్ నటించగా 'మైఖేల మదన కామరాజు' పేరుతో వచ్చిన ఒక డబ్బింగ్ సినిమాను మనం చూశాం. అది హిట్టయ్యింది కూడా. అందులో కమల హాసన్ నాలుగు పాత్రలు పోషించాడు. అతని సరసన చాలామంది హీరోయిన్లు నటించారు. ఇప్పుడు అదే పేరుతో తెలుగులో స్ట్రెయిట్‌గా ఒక సినిమా రూపొందింది. కాకపోతే ఇందులో హీరోలు ముగ్గురు. వారికి ఒక్కతే హీరోయిన్. ఇందులో మైఖేల్‌గా ప్రభుదేవా, మదన్‌గా శ్రీకాంత్, కామరాజుగా సునీల్ కనిపిస్తారు. హీరోయిన్ ఛార్మి. నిధి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ మూవీస్ బానర్‌పై ప్రవీణ్, రాజు నిర్మించారు. 'మైఖేల్ మదన కామరాజు' ప్రధానంగా హాస్యభరితమైన ప్రేమకథ. ముగ్గురు హీరోల మధ్య తలెత్తే తికమకే కావలసినంత వినోదాన్ని అందిస్తుంది. కథ ముంబై, గోవా, విశాఖపట్నం, హైదరాబాద్ నేపథ్యాల్లో నడుస్తుంది. ఆసక్తికరమైన సంగతేమంటే శ్రీకాంత్ హీరోగా నటించిన 'నిధి' సినిమా తోటే ప్రసాద్ దర్శకుడిగా మారాడు. అందుకే నిధి ప్రసాద్ అయ్యాడు. దాదాపు దశాబ్దం తర్వాత ఆ ఇద్దరూ కలిసి చేసిన సినిమా ఇది. మైఖేల్ పాత్రను రాయగానే ప్రసాద్ మనసులో మెదిలిన నటుడు ప్రభుదేవా. ఆ పాత్ర చాలా చురుగ్గా ప్రవర్తిస్తుంది. మరి ఛార్మిని హీరోయిన్‌గా తీసుకోవడానికి కారణం? "గ్లామరస్‌గా కనిపిస్తూనే పదహారణాల తెలుగింటి ఆడపడుచు అనిపించే అమ్మాయి కావాలి. ఛార్మి ఆ పాత్రకు అతికినట్లు సరిపోతుంది" అని ప్రసాద్ తెలిపాడు. ఇందులో నాగబాబు ఒక కీలక పాత్రలో కనిపిస్తారు. నిర్మాతలు ప్రవీణ్, రాజు ఇదివరకు ప్రసాద్ దర్శకత్వంలోనే 'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా' వంటి హిట్ ఫిల్మ్‌ని నిర్మించారు. ఆ నిర్మాతలకు న్యూ జెర్సీకి చెందిన ఎన్నారై వ్యాపారవేత్తలు మన్నెం వెంకటరమణ, యోగేష్ పటేల్ తోడయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేసిన ప్రసాద్ ఎవరి వద్దా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయలేదు. అయితే ఆయన తనని తాను ప్రియదర్శన్‌కు ఏకలవ్య శిష్యునిగా చెప్పుకుంటాడు. అందుకే ప్రియదర్శన్ తీసిన 'మాలామల్ వీక్లీ'ని తెలుగులో 'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా'గా రూపొందించాడు. మొదట యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ తీసిన ఆయన ఇప్పుడు వినోద ప్రధాన సినిమాలే తీస్తున్నాడు. 'కామెడీ సేఫ్‌బెట్. అందుకే వాటిని తీస్తున్నా' అంటాడాయన. హీరోలతో సమాన నిడివి వున్న మరో రెండు పాత్రల్లో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం కనిపించే ఈ చిత్రంలో జయప్రకాష్‌రెడ్డి, గిరిబాబు, వేణుమాధవ్, కోవై సరళ తదితరులు ఇతర తారాగణం. ఆశాషైనీ ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తుంది. చక్రి సంగీతం సమకూర్చిన ఇందులోని పాటల్ని భాస్కరభట్ల, కందికొండ రాశారు. ఏప్రిల్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. |
|
News | Box Office | Previews | Reviews | Trailers | Galleries | Wallpapers | Events | Videos | Audio Songs
©2006 - 2008 Chitramala.com. All rights reserved.



























