Pandurangadu
Cast :  Balakrishna,Sneha,Tabu
Director :  K. Raghavendra Rao
Music Director :  M.M. Keeravani
Producer :  K. Krishnamohana Rao
Banner :  R.K. Associates
 | Review  | Trailers  | Videos  | Audio  |  Wallpapers  | Photogallery  | Premiere- Photogallery  | Audio Launch- Photogallery  | Audio Platinum Disc- Photogallery |
బాలకృష్ణ కథానాయకుడిగా ద్విపాత్రలు పోషించిన భక్తిరస చిత్రం 'పాండురంగడు'. సీనియర్ దర్శకుడు కె రాఘవేంద్రరావు రూపొందించిన ఈ చిత్రాన్ని ఆర్‌కె అసోసియేట్స్ బానర్‌పై ఆయన సోదరుడు కె కృష్ణమోహనరావు నిర్మించారు. బాలకృష్ణ ఈ సినిమాలో విష్ణుమూర్తి అవతారమైన పాండురంగస్వామిగా, ఆయన భక్తుడు పుండరీకునిగా రెండు పాత్రలు చేశారు. స్నేహ, టాబు ఆయన సరసన నటించారు. సుహాసిని, వేద వంటి తారలు కూడా ఇందులో కొద్దిసేపు కనిపిస్తారు. విలక్షణ నటుడు మోహన్‌బాబు సైతం మునిగా ఒక అతిథి పాత్రలో దర్శనమివ్వనున్నారు. దివంగత ఎన్టీ రామారావు నటించిన 'పాండురంగ మహత్యం' ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఒరిజినల్‌లో నాగయ్య చేసిన పాత్రను కె విశ్వనాథ్ చేశారు. ఇది మహారాష్ట్రకు చెందిన పుండరీకుని కథ. రాఘవేంద్రరావు ఇదివరకు రూపొందించిన భక్తి చిత్రాలు 'అన్నమయ్య', 'శ్రీరామదాసు'లకు స్క్రిప్టులను సమకూర్చిన జెకె భారవి ఈ సినిమాకీ కథ, మాటలు అందించారు. ఆ సినిమాలకు సంగీతాన్ని అందించిన ఎంఎం కీరవాణి దీనికీ బాణీలు కూర్చారు. పాటల్ని వేటూరి, వేదవ్యాస, సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్ రాశారు. ఇందులో మొత్తం 16 పాటలున్నాయి. వీటిని 'పాండురంగ మహత్యం' సంగీత దర్శకుడు టివి రాజుకు అంకితమిస్తున్నట్లు కీరవాణి తెలిపారు. ఈ పాటల్లో సాహిత్య విలువలు గుబాళిస్తున్నాయని బాలకృష్ణ తెలిపారు. 
బాలకృష్ణ పౌరాణిక పాత్ర చేయడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు ఆయన శ్రీ కృష్ణార్జున విజయంలో కృష్ణునిగా, అర్జునునిగా నటించారు. ఈ సినిమాలోని మూడు పాటల్ని రాఘవేంద్రరావు థాయిలాండ్, ఇండోనేషియా, కంబోడియా వంటి విదేశాల్లో చిత్రీకరించడం గమనార్హం. అక్కడి హిందూ దేవాలయాల్లో ఈ పాటల్ని ఆయన తీశారు. ఆ ప్రదేశాల్లో బాలకృష్ణ, స్నేహలపై రెండు పాటల్నీ, బాలకృష్ణ, వేదలపై ఒక పాటనీ తీశారు. బాలకృష్ణ నటించిన చివరి మూడు సినిమాల్లో స్నేహ ఆయనతో నటించడం ఇది రెండవసారి. 'మహారథి'లో ఆమె ఒక హీరోయిన్ పాత్రని చేసిన సంగతి తెలిసిందే. టాబుది ఇందులో కీలకమైన వేశ్య పాత్ర. 'చెన్నకేశవరెడ్డి' తర్వాత ఆమె బాలయ్యతో చేసిన సినిమా ఇదే. అలాగే రాఘవేంద్రరావు సొంత బానర్‌లో బాలకృష్ణ నటించడం కూడా ఇది రెండోసారి. నిర్మాతగా రాఘవేంద్రరావు తొలి సినిమా హీరో బాలకృష్ణే. ఆ సినిమా 'అపూర్వ సహోదరులు'. ఈ సినిమాను మొదట ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 28న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ తర్వాత ఆ విడుదలను మే 30కి మార్చారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకపోయినా ఈ భక్తిరస చిత్రంతో తమ హీరో బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులందరికీ ఆరాధ్య నటుడిగా మారతాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
 

Give your Rating Here :
Average Rating: 2.89    Votes: 80

 
Featured Most Popular
 
 
Movies Actress Actor Events