Parugu
Cast :  Allu Arjun,
Director :  Bhaskar
Music Director :  Manisharma
Producer :  Raju
 | Review  | Trailers  | Videos  | Audio  |  Wallpapers  | Photogallery  | Audio Launch- Photogallery  | 50 Days Function- Photogallery  | Press Meet- Photogallery  | Audio Platinum Disc- Photogallery  | Working Stills- Photogallery  | Working Stills- Photogallery |
మే 1న వస్తున్న 'పరుగు' సినిమా మీదే ఇప్పుడందరి కళ్లూ. ఆ కాంబినేషన్ అలాంటిది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, నిర్మాత దిల్ రాజు. ప్రేక్షకుల ఆసక్తికి ఇంతకంటే కావలసింది వేరే ఏముంటుంది! దర్శకుడు భాస్కర్‌కు ఇది రెండో సినిమా. 'బొమ్మరిల్లు' తర్వాత అతను దర్శకత్వం వహించిన సినిమా కావడంతో, ఆ సినిమాను అతను ఏ రీతిన తీసి వుంటాడా.. అని అందరూ ఎదురు చూస్తున్నారు. మరోవైపు 'దేశముదురు' వంటి కెరీర్‌లోనే పెద్ద హిట్ సినిమా తర్వాత అర్జున్ చేసిన సినిమా ఇది. 'దేశముదురు'లో కండలు చూపిస్తూ నటించిన అర్జున్, ఈ సినిమాలో దానికి భిన్నంగా కనిపిస్తాడు. హెయిర్ స్టైల్ కూడా మార్చాడు. అతనితో 'ఆర్య'నీ, భాస్కర్‌తో 'బొమ్మరిల్లు'నీ నిర్మించిన రాజు ఇప్పుడు ఆ ఇద్దరితో ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వరా సినీ క్రియేషన్స్ బానర్‌పై నిర్మించారు.
వేసవి సెలవుల్లో ప్రేక్షకులు ఎలాంటి సినిమాను కోరుకుంటారో 'పరుగు' సరిగ్గా అలంటి సినిమా అని నిర్మాత రాజు తెలిపారు. "ఇది చక్కని లవ్ స్టోరీ, ఎంటర్‌టైన్‌మెంట్ మేళవించిన ఫ్యామిలీ డ్రామా. ఇందులోని ప్రతిపాటా సందర్భానుసారం వస్తుంది. వాటిలో సాహితీ విలువలుంటాయి. ఇప్పటికే మణిశర్మ సంగీతం కూర్చిన పాటలు బాగా ఆదరణ పొందుతున్నాయి" అని ఆయన చెప్పారు. 'బొమ్మరిల్లు'లో తండ్రీ కొడుకుల అనుబంధాన్ని చక్కగా చిత్రించిన భాస్కర్, 'పరుగు'లో తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని చర్చించాడు. ఆ పాత్రల్ని ప్రకాష్‌రాజ్, షీలా చేశారు. ఆ ఇద్దరి మధ్య అర్జున్ ఎలా ప్రవేశించాడు, ప్రేమను పండించుకోవడం కోసం షీలాను ఎక్కడకు తీసుకుపోయాడు.. అనేది కథాంశం. తన కెరీర్‌లోనే తొలిసారిగా అభినయ ప్రాధాన్యమున్న పాత్రను ఈ సినిమాలో చేశానని అర్జున్ తెలిపాడు.
మణిశర్మ సంగీతం కూర్చిన ఆరు పాటల్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, అనంత శ్రీరామ్ రాశారు. రాజు, భాస్కర్, అర్జున్.. ముగ్గురితోనూ పని చేయడం మణిశర్మకు ఇదే ప్రథమం. 'పరుగు'ను వాస్తవానికి ఏప్రిల్ 25న విడుదల చేయాలని రాజు భావించారు. అయితే 'జల్సా' సినిమాకు కనీసం 30 రోజుల వ్యవధి వుండేట్లు చూడమని చిరంజీవి సూచించడంతో దాని విడుదలను మే 1కి మార్చారు. సునీల్, చిత్రం శ్రీను, ధన్‌రాజ్, శ్రీనివాసరెడ్డి, పూనమ్ బజ్వా తదితరులు తారాగణమైన ఈ సినిమాకు బివిఎస్ రవి మాటలు రాయగా విజయ్ చక్రవర్తి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. కథ, స్క్రీన్‌ప్లేలను దర్శకుడు భాస్కర్ సమకూర్చారు.
 

Give your Rating Here :
Average Rating: 2.52    Votes: 96

 
Featured Most Popular
 
 
Movies Actress Actor Events